CBN – Pawan : చూడప్ప సిద్దప్ప ‘బాబు – పవన్’ బాండింగే వేరప్పా..!
CBN - Pawan : ఇటీవల చంద్రబాబు నాయుడు పవన్ కల్యాణ్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించానని, కానీ అందుబాటులోకి రాలేదని చేసిన వ్యాఖ్యలు వైసీపీతో పాటు ప్రతిపక్ష శిబిరాల్లో అనేక ఊహాగానాలకు దారితీశాయి
- By Sudheer Published Date - 08:53 AM, Sun - 16 February 25

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ-జనసేన (TDP – Janasena) కూటమి కీలకమైనది. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ (Chandrababu – Pawan Kalyan) మధ్య సంబంధం రాజకీయాల్లో ఎప్పుడు ప్రత్యేకమే. ఇటీవల చంద్రబాబు నాయుడు పవన్ కల్యాణ్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించానని, కానీ అందుబాటులోకి రాలేదని చేసిన వ్యాఖ్యలు వైసీపీతో పాటు ప్రతిపక్ష శిబిరాల్లో అనేక ఊహాగానాలకు దారితీశాయి. అయితే చాలా తక్కువ సమయంలోనే పవన్ కల్యాణ్ వాటిని కొట్టిపారేయడంతో వారి రాజకీయ ప్రత్యర్థుల ఆశలు అడియాసలయ్యాయి. పవన్, చంద్రబాబు కలిసి కనిపిస్తే విపక్షాలకు అసహనం. రాజకీయంగా వారు కలిసిన ప్రతిసారీ వైసీపీ నేతలు మరియు వారి మద్దతుదారులు కుట్రలు అల్లే ప్రయత్నం చేస్తారు. కూటమిలో మనస్పర్థలు ఉన్నట్లు ప్రచారం చేయడానికి ప్రత్యేకమైన ప్రయత్నాలు చేస్తారు. కానీ వాస్తవానికి పవన్ కల్యాణ్, చంద్రబాబు మధ్య గల అనుబంధం వ్యక్తిగతంగానూ, రాజకీయంగానూ బలమైనది. ప్రతి చిన్న విషయాన్ని వైసీపీ నేతలు బూతద్దంతో చూసినా, వీరిద్దరూ ఏ సందర్భమైనా కలిసినప్పుడు ఉల్లాసంగా గడిపేస్తారు.
Nara Lokesh Warning : తప్పు చేసిన ఏ వైసీపీ నేతను వదిలిపెట్టను – మంత్రి లోకేష్
టిడిపి-జనసేన కూటమి ఒక వేదికపై చేరినప్పటి నుంచి, తమ వైపు నుంచి ఎలాంటి అపోహలు లేకుండా నిరంతర కమ్యూనికేషన్ మెయింటైన్ చేయడం ముఖ్యంగా చూసుకుంటున్నారు. వైసీపీ మద్దతుదారుల మీడియా ఈ ఇద్దరిని విడదీయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా, కూటమి నేతలు వాటిని పట్టించుకోవడం లేదు. కింది స్థాయి క్యాడర్ కూడా ఈ విషయంలో స్పష్టమైన సంకేతాలు అందుకుంటూ, బలమైన సంకల్పంతో ముందుకు సాగుతోంది. చంద్రబాబు – పవన్ కల్యాణ్ అనుబంధం రాజకీయాలకతీతం. వీరిద్దరి మధ్య వ్యక్తిగతంగా కూడా మంచి అనుబంధం ఉంది. బహిరంగ వేదికలపై వారిద్దరూ మాట్లాడే తీరే దీనికి నిదర్శనం. పొత్తుల్లో ఉన్నప్పుడు చిన్నచిన్న మనస్పర్థలు సహజమే, కానీ అవి ప్రభావం చూపకుండా ముందుకు సాగేందుకు వీరి బంధం సహాయపడుతుంది. ఇది కూటమి బలపడి, మరింత సమర్థంగా పనిచేయడానికి కూడా దోహదం చేస్తుంది.
అధికారంలో ఉన్నపుడు ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేసిన వైసీపీ ఇప్పుడు విపక్షంలోకి వచ్చాక కూటమిని దెబ్బతీయాలనే వ్యూహాలు రచిస్తోంది. కానీ చంద్రబాబు, పవన్ కల్యాణ్ లాంటి అనుభవజ్ఞులు ఆ తంతు పసిగట్టి ముందుకెళ్తున్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసిన మీము ఎప్పుడు కలిసే ఉంటామని నిన్న విజయవాడ లో జరిగిన ఈవెంట్ చెప్పకనే చెప్పింది. ఇప్పటికైనా వైసీపీ శ్రేణులు బాబు – పవన్ లు ఎలా విడిపోతారా..? ఎలా విడగొట్టాలా అనేది ఆలోచించకుండా తమ పార్టీని ఎలా నిలబెట్టాలో అనేదానిపై దృష్టి పెడితే బాగుటుందని కూటమి శ్రేణులు సూచిస్తున్నారు.