RGV : బాబోయ్..నా దగ్గర డబ్బులు లేవు..వర్మ ఆవేదన
RGV : వరుస కేసులు ఓ పక్క, మరో వైపు పలు ఆర్ధిక లావాదేవీలకు సంబదించిన నోటీసులు..ఇలా రెండు వైపులా క్షణం నిద్ర పోకుండా చేయడంతో
- By Sudheer Published Date - 02:02 PM, Thu - 30 January 25

రామ్ గోపాల్ వర్మ (RGV) కు కూటమి సర్కార్ (AP Govt) చుక్కలు చూపిస్తుంది. గత వైసీపీ హయాంలో జగన్ అండ , డబ్బు చూసుకొని చంద్రబాబు , పవన్ కళ్యాణ్, లోకేష్ లపై రెచ్చిపోయిన వర్మ..ఇప్పుడు వారు ఇస్తున్న షాక్ లకు ఏంచేయాలో అర్థంకాక తలపట్టుకుంటున్నారు. వరుస కేసులు ఓ పక్క, మరో వైపు పలు ఆర్ధిక లావాదేవీలకు సంబదించిన నోటీసులు..ఇలా రెండు వైపులా క్షణం నిద్ర పోకుండా చేయడంతో వర్మ తన సన్నిహితుల దగ్గర తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నాడట.
Virat Kohli: కోహ్లీ అంటేనే క్రేజ్.. విరాట్ మీద అభిమానంతో ఫ్యాన్ ఏం చేశాడంటే?
సార్వత్రిక ఎన్నికల ముందు వ్యూహం అనే సినిమా కోసం రామ్ గోపాల్ వర్మ కు ఏపీ ఫైబర్ నెట్ (AP Fiber Net) నుంచి రూ. 1.15 కోట్లు జగన్ ప్రభుత్వం విడుదల చేసిన వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదమైంది. తాజాగా టీడీపీ యువనేత జీవీ రెడ్డి ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఈ వ్యవహారాన్ని బహిర్గతం చేశారు. జీవీ రెడ్డి వాదన ప్రకారం.. వర్మకు ఇచ్చిన నిధులు నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించలేదని స్పష్టమైంది. లక్ష్యం నెరవేరకుంటే, తీసుకున్న సొమ్మును తిరిగి చెల్లించాల్సిందే అంటూ ఫైబర్ నెట్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై వర్మ తక్షణ స్పందన ఇచ్చారు. అయితే ఆయన తన వద్ద ఇప్పుడంత మొత్తం లేదని సమాధానం ఇచ్చినట్లు సమాచారం. వర్మ సమాధానం తో ప్రభుత్వం 15 రోజుల గడువు ఇచ్చింది. ఈ వ్యవధిలో నిధులు తిరిగి చెల్లించకుంటే, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జీవీ రెడ్డి(GV Reddy) స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై వర్మ ఇంకా అధికారికంగా ఏ స్పందన ఇస్తారో చూడాలి.