HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Auspicious Times Are Back Getting Ready For Wedding Festivities

Wedding Season: మళ్లీ మొదలైన శుభ ఘడియలు.. పెళ్లి బాజాలు కు రెడీ

  • Author : Vamsi Chowdary Korata Date : 17-06-2026 - 11:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Auspicious times are back... getting ready for wedding festivities.
Auspicious times are back... getting ready for wedding festivities.

తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి మొదలైంది.. దాదాపు నెల రోజుల తర్వాత మళ్లీ శుభకార్యాల ముహూర్తాల కాలం వచ్చేసింది. ఈ నెల 15 నుంచి నిజ జ్యేష్ఠ మాసం మొదలవ్వడంతో జులై 9 వరకు మాత్రమే శుభ ముహూర్తాలు ఉన్నాయి. జులై 15 నుంచి ఆషాఢ మాసం, గురుమూఢం ప్రారంభమవుతాయి. మళ్లీ ఆగస్టు 15 వరకు ముహూర్తాలు లేవని, మళ్లీ శ్రావణ మాసంలోనే ముహూర్తాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ ముహూర్తాలు వివాహాలతో పాటుగా నూతన గృహప్రవేశాలు, కొత్త వ్యాపారాలు, నూతన కట్టడాల శంకుస్థాపనలకు మంచివని చెబుతున్నారు.

ముహూర్తాలు పరిమితంగా ఉండటంతో.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జులై 9 లోపే వివాహ వేడుకలకు ముహూర్తాలు ఫిక్స్ చేసుకుంటున్నారు. జూన్, జులై నెలలో ముహూర్తాల విషయానికి వస్తే.. జూన్ 19, 20, 21, 22, 24, 25, 26, 27, 28 తేదీలు మంచివని పండితులు చెబుతున్నారు. జులై 1, 6, 7, 9 తేదీలు కూడా బావుంటాయంటున్నారు. ముహూర్తాలు జులై 9 వరకు మాత్రమే ఉండటంతో పురోహితులు, ఫంక్షన్ హాల్స్, క్యాటరింగ్‌కు డిమాండ్ పెరిగింది. ముహూర్తం ఫిక్స్ చేసుకుని ఫంక్షన్ హాల్, క్యాటరింగ్ బుక్ చేసుకుంటున్నారు.. పురోహితులతో ముందుగానే మాట్లాడుకుంటున్నారు.

అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావం పెళ్లిళ్ల వ్యయంపై కనిపిస్తోంది.. ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఫంక్షన్ హాళ్లకు డిమాండ్ పెరిగింది.. డెకరేషన్, ఇతర ఖర్చులు పెరిగాయి. డీజిల్, పెట్రోల్ ధరలు పెరగడంతో వాహన కిరాయిలు పెంచారు. నిత్యావసర వస్తువులు, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడంతో క్యాటరింగ్ నిర్వాహకులు ధరలు పెంచారు. పెళ్లి భోజనాల మెనూలో వంటకాలను బట్టి ప్లేట్ ధర నిర్ణయిస్తారు.. నిత్యావసర వస్తువులు, గ్యాస్ ధరలు పెరగడంతో ప్లేటుకు కనీసం రూ. 500 వరకు చెల్లించాల్సి వస్తోంది. ఇక పురోహితులకు కూడా డిమాండ్ ఉంది. ఈ ఖర్చులన్నీ కలిపి వారి స్థాయిని బట్టి రూ. 5 నుంచి 10 లక్షల వరకు ఖర్చవుతోంది.

ఫంక్షన్ హాల్, భోజనాలు, డెకరేషన్, ఇతర ఖర్చుల సంగతి పక్కన పెడితే ముఖ్యంగా బంగారం గురించి చెప్పుకోవాలి. గతేడాది నుంచి చూస్తే బంగారం ధరలు భారీగా పెరిగాయి. దీనికి తోడు ఇరాన్-అమెరికా యుద్ధ ప్రభావం కూడా బంగారం ధరలపై కనిపించింది. పెళ్లంటే కనీసం ఐదారు తులాల బంగారమైనా కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఆ మాత్రం బంగారం కొనుగోలు చేయాలన్నా రూ. 7 లక్షల నుంచి 8 లక్షల వరకు ఖర్చవుతోంది. ఓవరాల్‌గా చూస్తే అమెరికా-ఇరాన్ యుద్ధం ప్రారంభం కాకముందు మరియు ఆ తర్వాత పోల్చి చూస్తే, పెళ్లి చేయాలంటే అదనంగా కనీసం రూ. 5 లక్షల వరకూ ఖర్చు పెరిగిందనే లెక్కలు ఉన్నాయి.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Pelli SandaD
  • Shubh Muhurats
  • Wedding Season

Related News

    Latest News

    • Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ, విషెన్ హలంబగే గొడవపై స్పందించిన క్రికెట్‌ బోర్డు.. శ్రీలంక క్రికెటర్‌కే భారీ జరిమానా

    • Pawan Kalyan: నిరంజన్ ఇంటికి పవన్ కళ్యాణ్.. అభిమాని చివరి కోరిక తీర్చనున్న జనసేనాని!

    • Kaleshwaram Temple: కాళేశ్వరం ఆలయానికి కొత్త రూపురేఖలు

    • Reebok: రీబాక్ భాగస్వామ్యంతో ‘లాస్ట్ వన్ స్టాండింగ్’ ప్రారంభం 

    • Isuzu Motors India: వాహనదారులకు ఇసుజు బంపర్ ఆఫర్ 

    Trending News

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd