Vallabhaneni Vamsi : ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అరెస్టు వారెంట్..
- By Sudheer Published Date - 12:45 PM, Fri - 2 February 24

గన్నవరం టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi)కి విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు షాక్ ఇచ్చింది. గతంలో ప్రసాదంపాడులో జరిగిన ఓ ఘటనపై కేసు నమోదుకాగా, విచారణకు హాజరు కాకపోవడంతో వంశీకి అరెస్ట్ వారెంట్ (Arrest Warrant) ఇచ్చింది. ఇదిలా ఉంటె ప్రస్తుతం వంశీ రాజకీయ ప్రస్థానం ఆందోళన కరంగా ఉంది.
We’re now on WhatsApp. Click to Join.
గత ఎన్నికల్లో టీడీపీ పార్టీ (TDP) నుండి విజయం సాధించిన వంశీ..ఆ తర్వాత అధినేత చంద్రబాబు (Chandrababu) కే విరోధిగా మారారు. చంద్రబాబు , లోకేష్ లపై విమర్శలు చేస్తూ వైసీపీ నేతగా మారిపోయారు. జగన్ సమావేశాలకు హాజరవుతూ వస్తున్న వంశీ..ఈసారి ఎక్కడి నుండి పోటీ చేస్తారనేది తెలియడం లేదు. వైసీపీ అధినేత జగన్ వరుసగా తన అభ్యర్థులను ప్రకటించే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఐదు జాబితాలను విడుదల చేసిన వైసీపీ అధినాయకత్వం ఎక్కడ కూడా వంశీ పేరు చేర్చలేదు.
గన్నవరం (Gannavaram YCP Ticket) నుంచి వల్లభనేని వంశీని తప్పిస్తారన్న ప్రచారం మాత్రం జోరుగా సాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్ధసారధిని గన్నవరం వెళ్లాలని వైసీపీ నాయకత్వం కోరినట్లు వార్తలు వస్తున్నాయి. అంటే వల్లభనేని వంశీని గన్నవరం తప్పించడానికే పార్టీ హైకమాండ్ సిద్ధమయినట్లేనా? అన్న అనుమానాలు బయలుదేరాయి. అయితే పార్ధసారధి మాత్రం గన్నవరం వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. దీంతో గన్నవరం పెద్దగా ఫోకస్ కాకపోయినా వల్లభనేని వంశీకి తిరిగి టిక్కెట్ ఇస్తే వైసీపీ నుంచి ఈసారి జరిగే ఎన్నికల్లో గెలవడం కష్టమని సర్వేలు చెబుతున్నాయి. దీంతో వైసీపీ వంశీ కి టికెట్ ఇస్తారా..? లేదా అనేది అర్ధం కావడం లేదు.
Read Also : Poonam Pandey : నటి పూనమ్ పాండే కన్నుమూత.. 32 ఏళ్ల వయసులోనే తిరిగిరాని లోకాలకు