APPSC : గ్రూప్-2 కీ విడుదల చేసిన ఏపీపీఎస్సీ
- By Kavya Krishna Published Date - 07:42 PM, Mon - 26 February 24

నిన్న జరిగిన గ్రూప్-2 పరీక్షల కీని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) విడుదల చేసింది. ఈ నెల 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి ఆన్లైన్ ద్వారా కీపై అభ్యంతరాలు స్వీకరిస్తుంది. పోస్ట్, వాట్సాప్, SMS ద్వారా వచ్చే అభ్యంతరాలను స్వీకరించబోమని APPSC స్పష్టం చేసింది. నిన్న ఏపీపీఎస్సీ గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే.. అయితే.. గ్రూప్-2 స్క్రీనింగ్ టెస్ట్ కు రాష్ట్ర వ్యాప్తంగా 4,83,525 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు.. కానీ.. అందులో 4,63,517 మంది అభ్యర్థులు మాత్రమే హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. దీనిలో కూడా.. 4,04,037 మంది అభ్యర్థులే పరీక్షకు హాజరయ్యారని ఏపీపీఎస్సీ పేర్కొంది. ఈ పరీక్షకు 87.17 శాతం మంది హాజరయ్యారని ఏపీపీఎస్సీ వెల్లడించింది. ఏపీ వ్యాప్తంగా 24 జిల్లాల్లోని 1327 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించగా, అన్ని చోట్లా పరీక్ష ప్రశాంతగా జరిగినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను 5 – 8 వారాల్లో ప్రకటిస్తామని తెలిపింది ఏపీపీఎస్సీ. గ్రూప్-2 మెయిన్ ఎగ్జామినేషన్ ను జూన్/జులైలో నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.
We’re now on WhatsApp. Click to Join.
మొత్తం 899 పోస్టులకు ఏపీపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. రాష్ట్రంలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ నమోదు కాలేదని ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. కానీ చిత్తూరు జిల్లాలో ఫేక్ హాల్ టికెట్ తో వచ్చిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. జూన్ లేదా జులైలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తామని.. అయితే గ్రూప్ -1 ప్రిలిమ్స్ వాయిదా పడుతుందనే వదంతులు నమ్మవద్దని ఆయన తెలిపారు. ఇంటర్ పరీక్షల వల్ల గ్రూప్-1 ప్రిలిమ్స్(Group 1) పరీక్షకు సెంటర్ల కొరత వచ్చే అవకాశం లేదని ఆయన వివరించారు.
Read Also : Nara Chandrababu Naidu : ప్రభుత్వం అంటే సంపద సృష్టించాలి.. అప్పులు చేసి బటన్ నొక్కడం కాదు