HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Political Party Chiefs Prepare Slogan For 2024 Elections

2024 Election: ముగ్గురి ఎన్నిక‌ల స్లోగ‌న్ ఫిక్స్!

`ఒక్క ఛాన్స్` ప్లీజ్ అంటూ జగన్ మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వ‌చ్చారు. ఇప్పుడు `మ‌రో ఛాన్స్` ఇస్తే 30ఏళ్లు నేనే సీఎంగా ఉంటా అంటున్నారు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ఉప‌యోగించిన `ఒక్క ఛాన్స్` సెంటిమెంట్ ను జ‌న‌సేనాని ప‌వ‌న్ అందుకున్నారు.

  • Author : CS Rao Date : 17-11-2022 - 5:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap
Ap

`ఒక్క ఛాన్స్` ప్లీజ్ అంటూ జగన్ మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వ‌చ్చారు. ఇప్పుడు `మ‌రో ఛాన్స్` ఇస్తే 30ఏళ్లు నేనే సీఎంగా ఉంటా అంటున్నారు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ఉప‌యోగించిన `ఒక్క ఛాన్స్` సెంటిమెంట్ ను జ‌న‌సేనాని ప‌వ‌న్ అందుకున్నారు. ఆ క్ర‌మంలో చంద్ర‌బాబునాయుడు `లాస్ట్ ఛాన్స్` ఇవ్వండ‌ని కోరుకుంటున్నారు. ఆయ‌న అభ్య‌ర్థ‌న‌ను వైసీపీ మాత్రం మ‌రో కోణం నుంచి తీసుకెళుతోంది. ఇవే చివ‌రి ఎన్నిక‌లంటూ చంద్ర‌బాబు చేసిన కామెంట్ల‌ను దేవుడు త‌దాస్తు అంటార‌ని మంత్రి బొత్సాతో పాటు వైసీపీ చెబుతోంది.

వాస్త‌వంగా చంద్ర‌బాబు ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ గెల‌వ‌క‌పోతే రాష్ట్రాన్ని బాగు చేసుకోలేమ‌ని ప్ర‌జ‌ల్ని అప్ర‌మ‌త్తం చేస్తున్నారు. మ‌ళ్లీ జగ‌న్మోహ‌న్ రెడ్డికి ఛాన్స్ ఇస్తే ఇక ఏపీని బాగుచేయ‌లేమ‌ని ప్ర‌జ‌ల్ని ఆలోచింప చేసేలా ఇవే చివ‌రి ఎన్నిక‌లంటూ చంద్ర‌బాబు అన్నార‌ని టీడీపీ చెబుతోంది. ఆయ‌న చేసిన ఈ వ్యాఖ్య‌లు ఇప్పుడు రాజ‌కీయ దుమారం రేపుతున్నాయి. క‌ర్నూలు జిల్లాకు వెళ్లిన చంద్ర‌బాబు పాల్గొన్న రోడ్ షోల‌కు ప్ర‌జ‌లు నీరాజ‌నం ప‌ట్టారు. పెద్ద ఎత్తున ఆయ‌న రోడ్ షోల‌కు త‌ర‌లిరావడం ఆ పార్టీకి ఊత్సాహం నింపుతోంది. చంద్ర‌బాబు క‌ర్నూలు ప్ర‌సంగంలోని ప్ర‌ధాన అంశాలివి.

Also Read:  Chandrababu: మీరు గెలిపిస్తే సరే.. లేదంటే ఇదే నా చివరి ఎన్నిక!

• పత్తికొండ రోడ్ షోలో పోటెత్తిన ప్రజలు
• కర్నూలు జిల్లాలో అడుగడుగునా ఘన స్వాగతం పలికిన ప్రజలకు ధన్యవాదాలు.
• అనేక సార్లు జిల్లా పర్యటనకు వచ్చినా….ఎన్నడూ చూడని స్థాయిలో జనం తరలివచ్చారు.
• తెలుగు ఆడబిడ్డల ఆత్మస్థైర్యం పెంచాలని నాడు డ్వాక్రా సంఘాలు తెచ్చాను.
• మొన్న వైజాగ్ వచ్చిన ప్రధాని మోదీ సైతం డ్వాక్రా సంఘాలను కొనియాడారు.
• తెలుగు మహిళలంటే నా తోబుట్టువులు. ఆడపిల్లలకు కాలేజీల్లో 33 శాతం రిజర్వేషన్లు పెట్టాను.
• రాష్ట్రం విడిపోయిన సమయంలో నన్ను గెలిపిస్తే…రాత్రింబవళ్లు పనిచేశాను.
• 2029లో ఎపి దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఉండాలి అని ప్రయత్నించాను.
• అయితే జగన్ కు ఇచ్చిన ఒక్కచాన్స్ తో అంతా రివర్స్ లో పోతుంది.
• మీలో చైతన్యం తేవడానికి ఇక్కడికి వచ్చాను. జగన్ ఇచ్చేది గోరంత….దోచేది కొండంత
• అన్ని ధరలు పెరిగాయి…ప్రజలపై పన్నులు పెరిగాయి. నెలకు ఒక్కొ కుటుంబంపై లక్షభారం మోపుతున్నాడు ఈ ముఖ్యమంత్రి
• యువతకు ఒక్క ఉద్యోగం వచ్చిందా.
• టిడిపి హయాంలో 16 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 30 లక్షల ఉద్యోగాలు వచ్చేవి. అప్పటికే 6 లక్షల ఉద్యోగాలు వచ్చాయి.
• కర్నూలులో ఎయిర్ పోర్ట్ తెచ్చాను….జిల్లాలో సీడ్ పార్క్ తెచ్చాను.
• అనంతపురంలో కియా మోటార్స్ సహా సీమలో అనేక పరిశ్రమలు తెచ్చాను
• టిడిపి అధికారంలో ఉండి ఉంటే కడపలో స్టీల్ ప్లాంట్ కూడా వచ్చేది
• కడపలో స్టీల్ ప్లాంట్ కట్టలేని సిఎం మూడు రాజధానులు కడతారా
• నేను ఈ రోజు మీటింగ్ పెట్టుకుంటే దాన్ని చెడగొట్టే ప్రయత్నం చేశారు.
• పత్తి కొండ ఎమ్మెల్యే పేటిఎం బ్యాచ్ ను పంపింది
• నేను జగన్ నాన్నను చూశా…వాళ్ల నాన్నను చూశా..దేనికీ భయపడను
• టివిలో మాట్లాడే జర్నలిస్టులపైనా కేసులు పెడుతున్నాడు.
• సిఐడి అంటే అక్రమ కేసులు పెట్టడానికేనా
• నాడు బకాసురుడిని అంతం చేసిన భీముడిలా…..రాష్ట్రంలో భూ బకాసురులను, జగన్ రెడ్డిని కట్టడి చెయ్యాలి
• పత్తి కొండ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో అన్నీ అక్రమాలే
• ఇసుక దందా అని ప్రశ్నిస్తే ఎమ్మెల్యే వారిపై కేసు పెట్టిస్తున్నారు.
• నేను ధర్మం కోసం పోరాడుతున్నా….ఈ చోటామోటా నాయకులకు భయపడను
• నిబంధనలు పాటించని పోలీసులను జగన్ రెడ్డి కూడా కాపాడలేరు
• పత్తికొండలో టమాటా రోడ్డుపై పారబోసే పరిస్థితి వచ్చింది
• నకిలీ విత్తనాలతో పత్తి రైతులు నష్టపోయారు.
• జగన్ ఒక్క రైతును పరామర్శించాడా….ఒక్క పొలానికి వచ్చాడా
• రాష్ట్రంలో మద్యం కంపెనీలు అన్నీ జగన్ వే….
• జగన్ రాజకీయ వ్యాపారస్తుడు
• వైసిపి ప్రభుత్వంలో ఇరిగేషన్ పనులు అన్నీ నిలిపివేశారు
• సిఎం జగన్ కు రంగుల పిచ్చి. టిడిపి హాయంలో కట్టిన భవనాలకు రంగులు వేసుకుంటాడు
• రంజాన్ తోఫాకు డబ్బులు లేవు కానీ…..రంగులకు డబ్బులు ఉంటాయి
• బిసిలకు పథకాలు లేవు…కానీ సాక్షికి మాత్రం కోట్ల ప్రకటనలు
• సాక్షి ఉద్యోగులకు ప్రభుత్వంలో పదవులు
• సాక్షి గుమస్తా ఇప్పుడు రాష్ట్రంలో సకల శాఖా మంత్రి
• రాష్ట్రంలో మెడపై కత్తి పెట్టి ఆస్తులు ఖాజేస్తున్నారు వైసిపి నేతలు
• ప్రపంచంలో మూడు రాజధానులు ఎక్కడైనా ఉన్నాయా
• పత్తి కొండకు వస్తుంటే రోడ్డు చేశాను…దారుణంగా ఉంది
• పత్తి కొండకు రోడ్డు వేయలేని వ్యక్తి మూడు రాజధానులు కడతాడా
• కర్నూల్ లో మేము కట్టిన ఎయిర్ పోర్ట్ లో జగన్ దిగాడు….మనం తెచ్చిన సోలార్ ప్లాంట్ తాను ప్రారంభించాడు
• కర్నూలుకు హైకోర్టు వస్తే నేను అడ్డుపడుతున్నా అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు
• జగన్ మాఫియా సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నాడు
• ప్రతిపక్షాలపై దాడులు చేయించి డిజిపి సమర్థించుకుంటున్నారు
• అలా సమర్థించిన నాటి డిజిపి సవాంగ్ అన్న ఇప్పుడు ఏమయ్యాడు
• నందిగామ వెళితే రాళ్లు వేసి అలజడి సృష్టించే ప్రయత్నం చేశారు
• పూలల్లో రాళ్లు వచ్చాయని నందిగామ ఘటనపై పోలీసులు చెప్పారు. అంటే రేపు పూలల్లో బాంబులు వస్తాయా
• నాకు నా ప్రాణం ముఖ్యం కాదు…రాష్ట్రం ముఖ్యం, ప్రజలు ముఖ్యం
• పవన్ కళ్యాన్ మీటింగ్ కు భూములు ఇస్తే గుంటూరు జిల్లాలో గ్రామస్థులను వేధించారు. రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్లు కూలగొట్టారు.
• పవన్ విశాఖ వస్తే అక్కడా ఇబ్బంది పెట్టారు
• నేను అనుకుంటే జగన్ నాడు తిరిగేవాడా
• రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా ముందు నేనే స్పందిస్తా
• ప్రజా స్వామ్యాన్ని కాపాడడం సీనియర్ నేతగా నా బాధ్యత
• ఆంబోతుల్లా వ్యవహరిస్తున్న వారిని కంట్రోల్ చెయ్యాల్సి ఉంది
• బాబాయ్ ను చంపి నారాసుర రక్త చరిత్ర అని నాపై రాశాడు
• తండ్రి హత్యపై వివేకా కూతురు సుప్రీం కోర్టుకు వెళ్లి పోరాడుతుంది
• టిడిపి ఎన్నికలకు సిద్దంగా లేదు అని సిఎం అనుకుంటున్నాడు
• 5 వేలు 10 వేలు ఇచ్చి గెలుద్దాం అని జగన్ అనుకుంటున్నాడు
• డబ్బులకు మన జీవితాలు తాకట్టు పెట్టుకుంటామా
• స్థానికంగా పంటల భీమా చెల్లింపులు చెయ్యలేదు
• ధరల స్థిరీకరణ నుంచి ఉల్లి, టమాటా పంటల రైతులను ఆదుకోవాలి
• నకిలీ విత్తనాల కారణంగా పత్తి దెబ్బతిన్నది. దీనికి రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలి
• రైతులకు డ్రిప్ సబ్సిడీలు కొనసాగించాలి
• నంద్యాలలో అబ్బుల్ సలాం కుటుంబాన్ని ఎలా వేధించి చంపారో అంతా చూశాం
• మైనారిటీలకు ఇచ్చే అన్ని పథకాలు రద్దు చేశారు
• మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టింది టిడిపి. వక్ఫ్ బోర్డు అస్తులు కాపాడింది కూడా టిడిపినే
• అసెంబ్లీ పరిణామాలు చూసి మళ్లీ అసెంబ్లీ కా రాను అని ప్రకటించాను
• మళ్లీ గౌరవ సభలోనే నేను అడుగు పెడతాను అని చెప్పాను
• ఫిజికల్ గా ఫిట్ గా ఉన్నా…రాష్ట్రాన్ని బాగు చేసి చూపిస్తా

Also Read:  Pump Sets Deadline: జ‌గ‌న్ కు ఎన్నిక‌ల ఎర్త్! `స్మార్ట్‌` గా షాక్‌!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra CM Jagan Reddy
  • chandrababu
  • jana sena pawan kalyan
  • kurnool

Related News

Pawan Lokesh Frd

ఇది కదా స్నేహమంటే !! పవన్ గురించి చెపుతూ నారా లోకేశ్ ఎమోషనల్

చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నప్పుడు, యావత్ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళనలో ఉన్న తరుణంలో, పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చి లోకేష్‌కు ధైర్యం చెప్పడం ఆ బంధాన్ని మరింత ధృడపరిచింది. "అంతా బాగున్నప్పుడు అందరూ పలకరిస్తారు, కానీ కష్టకాలంలో తోడు నిలిచేవారే నిజమైన స్నేహితులు" అని లోకేష్ పేర్కొనడం గమనార్హం.

  • Chandrababu Heritage Compan

    చంద్రబాబు హెరిటేజ్ కు షాక్

  • Chandrababu

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైల్వే ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు రివ్యూ

  • ap cabinet meeting highlights

    ఈ నెల 28న ఏపీ క్యాబినెట్ భేటీ

Latest News

  • ‘రేర్ ఎర్త్ కారిడార్’.. ఈ 4 రాష్ట్రాలనే ఎందుకు ఎంచుకున్నారు?

  • బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

  • విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

  • Megastar Chiranjeevi : మెగా వారసుడొచ్చాడంటూ చిరంజీవి సంతోషం

  • Budget 2026 -27 : పసలేని 2026 -27 బడ్జెట్ ! ఆశలపై నీళ్లు చల్లిన నిర్మలా

Trending News

    • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

    • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

    • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

    • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

    • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd