News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional

  • Telugu News
  • ⁄Andhra-pradesh News
  • ⁄Ap Home Minister Vanitha Sensational Comments On Rapes

Taneti Vanitha : కొన్ని అత్యాచారాలు అలా జరుగుతుంటాయ్

ఆంధ్రప్రదేశ్ హోం శాఖా మంత్రి తానేటి వనిత మరోవారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

  • By Hashtag U Updated On - 11:14 AM, Wed - 4 May 22
Taneti Vanitha  : కొన్ని అత్యాచారాలు అలా జరుగుతుంటాయ్

ఆంధ్రప్రదేశ్ హోం శాఖా మంత్రి తానేటి వనిత మరోవారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తల్లులు పిల్లలను సరిగా పెంచడం లేదంటూ ఈమధ్యనే ఆమె విశాఖపట్నంలో అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. తల్లులను అవమానిస్తారా అంటూ ఆందోళనలకు దిగాయి. ఈ వేడి ఇంకా చల్లారకముందే మంగళవారం నాడు గుంటూరులో రేపల్లె అత్యాచార ఘటనపై వనిత స్పందించిన తీరు కూడా వివాదాస్పదమైంది. చర్చలకు దారితీసింది.

గుంటూరులో ఓ కార్యక్రమంలో పాల్గోవడానికి వచ్చిన ఏపీ హోంశాఖా మంత్రి తానేటి వనిత… రేపల్లె ఘటనలో అత్యాచారానికి పాల్పడినవారు.. లైంగికదాడి చేయాలన్న ఉద్దేశంతో రాలేదన్నారు. వాళ్లు అప్పటికే తాగి ఉన్నారని.. డబ్బును ఆశించి ఆమె భర్తపై దాడికి దిగారన్నారు. దీంతో ఆమె తన భర్తను కాపాడుకోవాలనే ఉద్దేశంతో వారిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఆ సమయంలో వాళ్లు ఆమెను నెట్టివేయడానికి,
బంధించడానికి ప్రయత్నించే క్రమంలో ఆమె అత్యాచారానికి గురైంది. పేదరికం, మానసిక పరిస్థితుల వల్ల అనుకోని రీతిలో అత్యాచారాలు జరుగుతుంటాయి అని హోం మంత్రి వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

ఇప్పటికే ఏపీలో గత మూడేళ్లకాలంలోనే 800 మందికి పైగా మహిళలపై లైంగిక దాడులు జరిగాయంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇలాంటి సమయంలో వివాదాస్పదమయ్యేలా, చర్చకు దారితీసేలా హోంమంత్రి వ్యాఖ్యానించడంతో విపక్షాలు భగ్గుమంటున్నాయి. మహిళలకు రక్షణ కల్పించాల్సిందిపోయి ఇలా వ్యాఖ్యానిస్తారా అంటూ ఫైరయ్యాయి.

రేపల్లె అత్యాచార ఘటనకు, పోలీస్ సిబ్బంది కొరతకు సంబంధమే లేదని హోం మంత్రి వనిత చెప్పారు. పోలీస్ శాఖలో సిబ్బంది కొరత ఉందని అంగీకరిస్తూనే.. ఆ ఖాళీల భర్తీపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

Tags  

  • ap home minister
  • crime news
  • rapes cases
  • Taneti Vanitha

Related News

Beautician Swetha Reddy Case : శ్వేతారెడ్డి కేసులో కొత్త కోణం.. మొబైల్ ఫోన్లను పరిశీలించడంతో…!

Beautician Swetha Reddy Case : శ్వేతారెడ్డి కేసులో కొత్త కోణం.. మొబైల్ ఫోన్లను పరిశీలించడంతో…!

కొన్ని ఫేస్ బుక్ పరిచయాలు అక్రమ సంబంధాలకు దారితీయడంతోపాటు ఏకంగా ప్రాణాలను కూడా బలిగొంటున్నాయి.

  • Cop Kills: డబ్బులు అడగడంతో బాలుడిని హత్య చేసిన కానిస్టేబుల్

    Cop Kills: డబ్బులు అడగడంతో బాలుడిని హత్య చేసిన కానిస్టేబుల్

  • AP Home: వాళ్ల హాయాంలోనే అత్యాచారాలు ఎక్కువ

    AP Home: వాళ్ల హాయాంలోనే అత్యాచారాలు ఎక్కువ

  • Controversial Comments: జగన్ చెప్పినట్టు ‘దిశ’తో 21 రోజుల్లో ఎవరికీ ఉరిశిక్ష పడలేదు.. ఈలోపే హోంమంత్రి..!

    Controversial Comments: జగన్ చెప్పినట్టు ‘దిశ’తో 21 రోజుల్లో ఎవరికీ ఉరిశిక్ష పడలేదు.. ఈలోపే హోంమంత్రి..!

  • Supreme Slams: డిఫెన్స్ లాయర్ కి చీఫ్ జస్టిస్ వార్నింగ్

    Supreme Slams: డిఫెన్స్ లాయర్ కి చీఫ్ జస్టిస్ వార్నింగ్

Latest News

  • Deepika Padukone:15 ఏళ్ల క్రితం నన్నెవరూ నమ్మలేదు.. దీపికా ఎమోషనల్!

  • Whats App : వాట్సాప్ గ్రూప్స్ లో మరో రెండు కొత్త ఫీచర్లు

  • Kinnera Moguliah : `ప‌ద్మ‌శ్రీ` వాప‌స్ కు కిన్నెర మొగుల‌య్య `సై`

  • Solar Power : రాత్రి వేళ `సోలార్ ప‌వ‌ర్` ఉత్ప‌త్తి

  • Nallala Odelu: టీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లోకి నల్లాల ఓదెలు!

Trending

    • Solar Pole: సూర్యుడి ధృవపు మిస్టరీ గుట్టురట్టు.. ఫోటోలు,వీడియోలు పంపిన సోలార్ ఆర్బిటర్

    • Crocodile Attack: రాజస్థాన్ లో షాకింగ్ ఘటన…నదిలో స్నానం చేస్తున్న వ్యక్తి మొసలి దాడి..!

    • Swami Nithyananda: నిత్యానందకు ఏమైంది? నిర్వికల్ప సమాధి అంటే ఏంటి?

    • Youngest Organ Donor: ఆరేళ్ల బాలిక అవయవదానం..ఎయిమ్స్ హిస్టరీలోనే తొలిసారి…అసలేం జరిగింది..!!

    • Viral Video : ఒకే బ్లాక్ బోర్డుపై..ఏక కాలంలో హిందీ, ఉర్దూ క్లాస్ లు!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: