HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Govt For More Debts To Make Payments Salaries

AP Govt Debts : కొత్త ఏడాది తొలి రోజు నుంచే ఏపీ సర్కారు అప్పుల వేట

అప్పులు లేనిదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పూట గడిచేలా లేదు పరిస్థితి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం రోజునే ఖజానా ఖాళీగా ఉంది. అందుకే తొలి రోజు నుంచే అప్పు కోసం ప్రయత్నాలు ప్రారంభించింది.

  • Author : Hashtag U Date : 03-04-2022 - 11:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ys Jagan Nampally Special Court
Ys Jagan Nampally Special Court

అప్పులు లేనిదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పూట గడిచేలా లేదు పరిస్థితి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం రోజునే ఖజానా ఖాళీగా ఉంది. అందుకే తొలి రోజు నుంచే అప్పు కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ రుణాలు తీసుకోవాలంటే దానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం. అందుకే కేంద్రం అనుమతులు కోసం ఎదురుచూస్తోంది. ఇప్పటికే బిల్లుల చెల్లింపుల కోసం ఉన్న అన్ని నిధులనూ వాడుకుంది. చివరకు చేబదుళ్లు కింద రూ.2,816 కోట్ల తీసుకుంది.

ఈ ఆర్థిక సంవత్సరంలో స్థూల రుణ పరిమితి రూ.79,454 కోట్లు ఉండొచ్చని అంచనా. రాష్ట్ర జీఎస్డీపీలో బహిరంగ మార్కెట్ రుణ పరిమితి 3.5 శాతం. అంటే దాదాపు 42 వేల కోట్ల రూపాయిలు అవుతుంది. గతంలో తిరిగి చెల్లించిన రూ.16 వేల కోట్లను ఈ పరిమితికి చేర్చాలని అంటోంది. ఇక మూల ధన వ్యయపరిమితితో లెక్కగట్టే రుణం దాదాపు రూ.6 వేల కోట్లు. దీంతోపాటు ఉమ్మడి ఏపీలో బహిరంగ మార్కెట్ రుణ పరిమితి దాదాపు రూ.26,380 కోట్లు. అంటే విభజన చట్టం ప్రకారం ఏపీకి రావలసిన వాటా 58.32 శాతం. దీని ప్రకారం దాదాపు మరో రూ.15 వేల కోట్లు అప్పు తెచ్చుకునే వెసులు బాటు ఉంటుందని ఏపీ సర్కారు అంటోంది. ఇవన్నీ కలిపితే.. రూ.79,454.31 కోట్లను అప్పుగా తెచ్చుకోవచ్చని ఏపీ సర్కార్ అంచనా వేసింది.

ఈ రూ.79,454.31 కోట్లలో వివిధ రకాల మినహాయింపులను తీసేస్తే.. దాదాపు రూ.71,876 కోట్లను అప్పుగా తీసుకోవచ్చని ఏపీ సర్కార్ భావిస్తోంది. అందుకే ఈమేరకు వెసులుబాటు కల్పించాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరింది. సాధారణ పరిస్థితుల్లో అయితే.. కేంద్ర ఆర్థిక శాఖలో ఉన్న వ్యయ నియంత్రణ విభాగం.. అన్నీ లెక్కేసి.. తొలి 9 నెలల వరకు ఎంత అప్పు తెచ్చుకోవచ్చో చెబుతుంది. ఒకవేళ ఆ లెక్కలు ఆలస్యమైతే.. కనీసం ఏప్రిల్ నెల వరకైనా కొంత మేర రుణం తీసుకోవడానికి అనుమతులు ఇస్తుంది.

ఏపీ ప్రభుత్వానికి ఈ నెల గడవాలంటే కచ్చితంగా అప్పు తెచ్చుకోక తప్పదు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలతోపాటు, పెన్షన్ల కింద రూ.5,500 కోట్లు ఖర్చవుతుంది. ఇప్పటికే ఉద్యోగులకు మార్చి నెల జీతాలు చెల్లించాల్సి ఉంది. దీంతో ఏపీ సర్కార్ వైఖరిపై ప్రభుత్వాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP government
  • hiked salaries
  • ys jagan

Related News

Msme Summit 2026

AP : ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ – 2026లో కీలక ఒప్పందాలు చేసుకున్న ఏపీ ప్ర‌భుత్వం

ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి కీలక అడుగులు వేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 38 కొత్త ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన చేశారు. అనంతరం స్టార్టప్‌లు, ఎంఎస్ఎంఈల ప్రోత్సాహానికి వివిధ సంస్థలతో ప్రభుత్వం పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆర్టీఐహెచ్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న ర

  • Chandrababu Naidu

    Chandrababu Naidu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

  • Atchannaidu fires on ys Jagan

    Atchannaidu: జగన్ పై అచ్చెన్నాయుడు ఫైర్

Latest News

  • BYST : ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!

  • Telangana : రాష్ట్ర రెవెన్యూ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ

  • BRS : కేటీఆర్, హరీష్ రావు తమ కార్యకర్తలకు బోధిస్తున్న సిద్ధాంతం ఇదేనా?.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ

  • Kerala : కేర‌ళ మాజీ సీఎం పిన‌ర‌య్ విజయన్ నివాసం వద్ద ఉద్రిక్తత.. ఈడీ బృందం వాహనాలపై దాడి

  • TDP : టీడీపీ మహానాడులో తెలంగాణపై చర్చ.. ఎన్టీఆర్, చంద్రబాబు సేవలను గుర్తుచేసిన నేతలు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

    • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd