New Scheme : మరో కొత్త ప్రాజెక్ట్‌కు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్
New Scheme : ఈ ప్రాజెక్టును పైలట్ ప్రాజెక్ట్‌గా కుప్పం నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రారంభించి, రోగుల ఆరోగ్య డేటాను డిజిటల్ రూపంలో భద్రపరచే విధంగా చేపట్టనున్నారు
- By Sudheer Published Date - 12:38 PM, Thu - 3 July 25

ప్రజల ఆరోగ్యాన్ని కేంద్రంగా చేసుకొని, వారి వైద్య సేవలకు మరింత సమర్థతను అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, టాటా కంపెనీ సహకారంతో డిజిటల్ హెల్త్ సర్వే సెంటర్ (Digital Health Survey Center)ను ప్రారంభించింది. ఈ ప్రాజెక్టును పైలట్ ప్రాజెక్ట్‌గా కుప్పం నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రారంభించి, రోగుల ఆరోగ్య డేటాను డిజిటల్ రూపంలో భద్రపరచే విధంగా చేపట్టనున్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందించడంలో ఇది కీలకంగా మారనుంది.
HHVM Trailer : అదిరిపోయిన హరిహర వీరమల్లు ట్రైలర్ ..ఫ్యాన్స్ కు పూనకాలే
ఈ డిజిటల్ సర్వే ద్వారా రోగులకు ఇప్పటివరకు అందిన చికిత్స, వారి ఆరోగ్య పరిస్థితులు, ఫాలోఅప్ వివరాలన్నీ సిస్టమేటిక్‌గా డేటాబేస్‌లో ఉండనుండటంతో వైద్యులకూ, ఆరోగ్య శాఖకూ తగిన సమాచారం ముందే అందుతుంది. ఈ విధానం కుప్పం నియోజకవర్గంలో విజయవంతమైతే, రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానాన్ని విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇది రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ఓ మైలురాయిగా నిలవనుంది.
ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన రెండో రోజున భాగంగా ఉదయం 10:30కి కుప్పం ఏరియా ఆసుపత్రిలో టాటా డిజిటల్ సర్వే సెంటర్‌ను ప్రారంభించారు. తర్వాత 12:15కి స్వగృహంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని కార్యక్రమాలు ముగించుకొని సాయంత్రం 4:10 గంటలకు తుమ్మిసి హెలిప్యాడ్‌కి చేరుకుని బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. ప్రజల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు, ఆయా ప్రాంతాల్లో వైద్య సేవల స్థాయిని అమూలంగా మార్చే అవకాశముంది.