HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Ap Government Guidelines On Allotment Of House Plot

AP Govt : బీపీఎల్‌ కుటుంబాలకే ఉచిత ఇంటీ స్థలం: ఏపీ ప్రభుత్వం

అందరికి ఇళ్లు ప్రాతిపదికన కేటాయించిన స్థలాలకు రాష్ట్ర ప్రభుత్వం కన్వేయన్స్ డీడ్ ఇస్తుందని ఉత్తర్వుల్లో వెల్లడించారు. 10 ఏళ్ల కాలపరిమితితో ఫ్రీ హోల్డ్ హక్కులను కల్పించేలా ఈ కన్వేయన్స్ డీడ్ ఉంటుందని స్పష్టం చేశారు.

  • By Latha Suma Published Date - 04:30 PM, Mon - 27 January 25
  • daily-hunt
AP Government guidelines on allotment of house plot
AP Government guidelines on allotment of house plot

AP Govt : దారిద్ర్యరేఖకు దిగువన(బీపీఎల్‌) ఉన్న కుటుంబాలకే ఉచిత ఇంటిస్థల కేటాయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ‘అందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల చొప్పున స్థలాలు ఇచ్చే అంశంపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఉత్తర్వులు జారీ చేసారు. అందరికి ఇళ్లు ప్రాతిపదికన కేటాయించిన స్థలాలకు రాష్ట్ర ప్రభుత్వం కన్వేయన్స్ డీడ్ ఇస్తుందని ఉత్తర్వుల్లో వెల్లడించారు. 10 ఏళ్ల కాలపరిమితితో ఫ్రీ హోల్డ్ హక్కులను కల్పించేలా ఈ కన్వేయన్స్ డీడ్ ఉంటుందని స్పష్టం చేశారు.

ఇంటిపట్టా ఇచ్చిన రెండేళ్లోపు నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. లబ్దిదారులకు రాష్ట్రంలో ఎక్కడా ఇంటి స్థలం, సొంతిల్లు ఉండకూడదని నిబంధన విధించింది. కేంద్ర, రాష్ట్ర గృహ నిర్మాణ పథకాల్లోనూ లబ్ధిదారుడుగా ఉండకూడదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇళ్ల స్థలాలకు ప్రభుత్వం కన్వేయన్స్ డీడ్ ఇస్తుందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. జీవితకాలంలో ఒకసారే ఉచిత ఇంటిపట్టా ఇచ్చేలా విధివిధానాలు రూపొందించారు.

దీంతో పాటు వివిధ అర్హతా నిబంధనల్ని పేర్కొంటూ మార్గదర్శకాలు జారీ చేసారు. రెవెన్యూ శాఖ మంత్రి చైర్మన్​గా, పురపాలక, హౌసింగ్ మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు సభ్యులుగా ఏర్పాటైన కమిటీ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తుందన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కోసం కూడా అధికారుల కమిటీని నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల హామీల అమలు దిశగా కూటమి ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది.

Read Also: Land registration Value Increase : ఏపీలో ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ విలువలు పెంపు..

 

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andariki Illu Scheme
  • ap govt
  • BPL
  • BPL families
  • poverty line

Related News

Sugali Preethi Case Cbi

Sugali Preethi Case : సీబీఐకి సుగాలి ప్రీతి కేసు

Sugali Preethi Case : సుగాలి ప్రీతి తల్లి తమకు న్యాయం కావాలని కోరడంతో, కూటమి ప్రభుత్వం ఈ కేసును తిరిగి సీబీఐకి బదిలీ చేయాలని నిర్ణయించింది

    Latest News

    • PM Modi: మ‌రో దేశ అధ్యక్షుడితో ప్ర‌ధాని మోదీ చ‌ర్చ‌లు.. ఎందుకంటే?

    • Team India Jersey: టీమిండియా న్యూ జెర్సీ చూశారా? స్పాన్సర్‌షిప్ లేకుండానే బ‌రిలోకి!

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • BCCI: డ్రీమ్ 11తో ముగిసిన ఒప్పందం.. బీసీసీఐ రియాక్ష‌న్ ఇదే!

    • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd