Sharada Peetham : శారదా పీఠానికి మరో షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
Sharada Peetham : తిరుమలలో గోగర్భం డ్యామ్ సమీపంలో శారదా పీఠానికి కేటాయించిన భూకేటాయింపును రద్దు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది
- By Sudheer Published Date - 10:56 PM, Thu - 24 October 24

ఏపీ సర్కార్ (AP government)..శారదా పీఠం (Visakha Sarada Peetham)కు మరో షాక్ ఇచ్చింది. గత వైసీపీ (YCP) ప్రభుత్వ హయాంలో ఇచ్చిన స్థలం అనుమతిని ఈ మధ్యనే రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. విశాఖలో 15 ఎకరాల స్థలం విలువ రూ.220 కోట్లు అయితే… కేవలం రూ. 15 లక్షల నామమాత్రపు ధరకు శారదా పీఠానికి గత ప్రభుత్వం ఇచ్చింది. కూటమి ప్రభుత్వ వచ్చాక ఈ స్థలంపై దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తు అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా స్థలం అనుమతులను ప్రభుత్వం రద్దు చేసింది.
ఇక ఇప్పుడు తిరుమలలో గోగర్భం డ్యామ్ సమీపంలో శారదా పీఠానికి కేటాయించిన భూకేటాయింపును రద్దు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానములు) దేవదాయశాఖ నుంచి ఆదేశాలు జారీ చేసింది. గతేడాది, డిసెంబర్ 26న అప్పటి టీటీడీ బోర్డు శారదా పీఠానికి గోగర్భం వద్ద భూమిని కేటాయించింది. అయితే, ఈ భూ కేటాయింపుపై ప్రభుత్వం నుంచి సమీక్ష చేయమని టీటీడీని కోరుతూ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు, దీనిపై తాజాగా రద్దు నిర్ణయం తీసుకున్నారు.
ఇక విశాఖ శారదాపీఠం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం నగరంలో ఉన్న ప్రముఖ పీఠం. ఇది శారదా దేవి, కన్యా లక్ష్మీ నరసింహ దేవుడి మరియు సనాతన ధర్మానికి అంకితమయిన పీఠంగా ప్రసిద్ధి చెందింది. శారదాపీఠం దైవిక విద్య, తత్వశాస్త్రం మరియు సంస్కృతిని ప్రచారానికి ముఖ్యమైన కేంద్రంగా నడుస్తుంది. ఇది తాత్త్వికతను, ప్రాచీన విద్యను మరియు భారతీయ సంస్కృతిని కొనసాగించడానికి విస్తారంగా ప్రయత్నిస్తోంది.
ఈ పీఠాన్ని పండితులు, ఆధ్యాత్మిక గురువులు మరియు అనేక ఆచార్యులు అనుసరితుంటారు. పూజ, యజ్ఞాలు, మరియు ధ్యానం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేంద్రంగా పనిచేస్తోంది. విశాఖ శారదాపీఠం అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, ఉపన్యాసాలు మరియు సదస్సులు నిర్వహిస్తుంది. ఇది విద్యార్థులకు మరియు సాధకులకు ఆధ్యాత్మికతను అభివృద్ధి చేసేందుకు ఒక వేదికగా నిలుస్తోంది. అలాగే వివిధ కళలు, సంగీతం, నాట్యం, మరియు భక్తి రచనలు వంటి ప్రాచీన భారతీయ సంప్రదాయాలను ప్రోత్సహించడానికి కృషి చేస్తుంది.
Read Also : Lokesh – NVIDIA CEO : జెన్సన్ హువాంగ్ తో నారా లోకేష్ భేటీ..