AP Power: ఏపీ ప్రభుత్వానికి ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యూలేటరీ కమిషన్ ఘాటు లేఖ
ఏపీ ప్రభుత్వం అప్పులు చేస్తుందంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ విమర్శలకు ఇప్పుడు మరింత బలం చేకూరింది. ఏపీ డిస్కంలకు చెల్లించాల్సిన వేల కోట్ల సబ్సిడీ బకాయిల పెండింగ్ పై ఎలక్ట్రిసిటీ రెగ్యూలేటరీ కమిషన్ ప్రభుత్వానికి ఘాటుగా లేఖను రాసింది. ఈ లేఖను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు, డిస్కంలకు, ఇంధన శాఖ సెక్రెటరీకి పింపింది.
- By Hashtag U Published Date - 02:54 PM, Fri - 12 November 21

ఏపీ ప్రభుత్వం అప్పులు చేస్తుందంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ విమర్శలకు ఇప్పుడు మరింత బలం చేకూరింది. ఏపీ డిస్కంలకు చెల్లించాల్సిన వేల కోట్ల సబ్సిడీ బకాయిల పెండింగ్ పై ఎలక్ట్రిసిటీ రెగ్యూలేటరీ కమిషన్ ప్రభుత్వానికి ఘాటుగా లేఖను రాసింది. ఈ లేఖను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు, డిస్కంలకు, ఇంధన శాఖ సెక్రెటరీకి పింపింది.
ఇటీవల రూ. 25,257 కోట్ల బకాయిలపై ఈఆర్సి రాసిన లేఖను పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ బయటపెట్టారు. ఈ నెల 9వ తేదీ ఎపి ఈఆర్సిని కలిసి ఇంధన శాఖలో పరిస్థితిలు, నిర్ణయాలపై పిఎసి చైర్మన్ పయ్యావుల ఈఆర్సికి ఫిర్యాదు చేశారు. పయ్యావుల భేటీ తరువాత ప్రభుత్వానికి ఏపీ ఈఆర్సీసీ లేఖ రాసింది. ప్రభుత్వం నుంచి డిస్కంలకు రావాల్సిన 1రూ. 5474 కోట్ల సబ్సిడీ బకాయలు వెంటనే చెల్లించాలని లేఖలో పేర్కింది. స్థానిక సంస్థలు, ఇతర ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన 9783 కోట్ల ను విడుదల చెయ్యాలని… బకాయిల చెల్లింపులపై 14 రోజుల గుడువుతో నోటీసులు ఇవ్వాలని సూచించింది. ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థల నుంచి 14 రోజుల్లో స్పందన రాకపోతే విద్యుత్ సరఫరా నిలిపివెయ్యాలని ఆదేశించింది.బకాయిల వల్ల డిస్కంలు మనుగడే ప్రమాదంలో పడిందని ఏపీఈఆర్సీ లేఖలో పేర్కొంది.
Also Read : Apex Council : కేసీఆర్ అబద్ధాలపై కేంద్రం ఫోకస్
మూడు నెలలుగా ట్రూ అప్ చార్జీల పేరుతో ప్రజల నెత్తిన కరెంట్ ఛార్జీల భారం మోపేందుకు యత్నించారని…హైకోర్టు జోక్యం తో ఇది ఆగిపోయిందని టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అన్నారు .ఎలక్ట్రీసిటీ రెగ్యూలేటరీ కమిషన్ దీనిపై నిరాభ్యారంతరంగా విచారణ జరపవచ్చని…ట్రూ అప్ చార్జీల పాపం ప్రభుత్వందేనని ఆయన ఆరోపించారు. రూ.25 వేల కోట్ల బకాయిలు ప్రభుత్వం నుంచి చెల్లించాల్సి ఉందని…ప్రజలు నెలనెలా పైసా పైసా కడుతుంటే… ఎందుకు ప్రభుత్వం పై ప్రేమ చూపుతున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ఎవరికైనా రాయితీ ఇవ్వాలి అనుకుంటే ముందుగా ఆ డబ్బులను చెల్లించాలని కమిషన్ ఎందుకు ఇప్పటి వరకు మౌనంగా ఉందో అర్థంకావడం లేదన్నారు. స్థానిక సంస్థ లు చెల్లించకుంటే సరఫరా నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చి ప్రభుత్వాన్ని బ్రతిమిలాడాల్సిన అవసరం ఎందకు వస్తుందని ప్రశ్నించారు. ప్రజలపై ప్రేమ ఉండాల్సిన కమిషన్… ప్రభుత్వం పై ప్రేమ చూపిస్తోందని పయ్యావుల ఆరోపించారు. తక్షణమే ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.15వేల కోట్ల బకాయిలు రాబట్టాలని…ఆమేరకు ఏపీ ఈఆర్సీ ఆదేశాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదాని తో 9000 మెగా వాట్ల చీకటి ఒప్పందం పై ఈఆర్సీ ఎందుకు మౌనంగా ఉంటుందని ప్రశ్నించారు. ప్రభుత్వ చర్యలకు కమిషన్ బాధ్యత వహించకూడదని… ప్రభుత్వం నుంచి ముక్కుపిండి వసూలు చేసి… చీకటి ఒప్పందాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. కమిషన్ జులు విధించాలని… చట్టం ప్రకారం ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చి…. ప్రజలపై భారం పడకుండా చూడాలని పయ్యావుల అన్నారు.
Related News

TDP : జగన్ రెడ్డికి ఓటమి భయంతోనే ఈ అక్రమ అరెస్టులు – టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా
అక్రమ కేసులు, అరెస్టులనే జగన్మోహన్ రెడ్డి నమ్ముకు న్నాడని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు.