CM Phone Call : చంద్రబాబు, పవన్ కల్యాణ్.. ఒక ఫోన్ కాల్.. అసలేం జరిగింది ?
‘‘పవన్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించా. దొరకలేదు. ఇప్పుడెలా ఉన్నారు’’ అని చెప్పారు.
- By Pasha Published Date - 12:22 PM, Wed - 12 February 25

CM Phone Call : ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంపై కొన్ని తప్పుడు కథనాలు మీడియాలో ప్రచారం అవుతున్నాయి. ఆరోగ్యం గురించి వాకబు చేసేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు సీఎం చంద్రబాబు నాయుడు కాల్ చేస్తే.. పవన్ ఫోన్ ఎత్తలేదనే ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు ఫోన్ కాల్‌ను పవన్ ఎందుకు ఎత్తలేదు ? అనే దానిపై అనవసర చర్చకు తెర లేపుతున్నారు. చిన్న అంశాన్ని భూతద్దంలో చూపెట్టి పెద్దదిగా చేసేందుకు కట్టు‘కథలు’ అల్లుతున్నారు. చిన్నపాటి ఫోన్ కాల్‌కు, రాష్ట్రంలోని ప్రభుత్వానికి లింకు పెట్టడం సరికాదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఆ తరహాలో కథనాలు అల్లడాన్ని తప్పుపడుతున్నారు.
Also Read :Delhi CM Race: ఢిల్లీ సీఎంగా యోగి లాంటి లీడర్.. ఎందుకు ?
చంద్రబాబు మంచితనం..
కొద్ది రోజులుగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అస్వస్థతతో ఉన్నారు. ఆయన జ్వరం, వెన్ను నొప్పితో బాధ పడుతున్నారు. అందువల్లే మంత్రివర్గ భేటీకి పవన్ హాజరు కాలేదు. ఇటీవలే కేబినెట్ మంత్రులు, శాఖల కార్యదర్శులతో చంద్రబాబు ప్రత్యే కంగా ఏర్పాటు చేసిన సమావేశానికి కూడా పవన్ రాలేదు. పవన్ గైర్హాజరీపై తప్పుడు కోణంలో ప్రచారం జరుగుతుండటంతో మంత్రి మనోహర్ క్లారిటీ ఇచ్చారు. పవన్ వెన్నునొప్పితో బాధ పడుతున్నారని, అందుకే సమావేశానికి హాజరు కాలేదన్నారు. ఈసందర్భంగా సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. ‘‘పవన్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించా. దొరకలేదు. ఇప్పుడెలా ఉన్నారు’’ అని మంత్రి మనోహర్‌ను అడిగారు. చంద్రబాబు(CM Phone Call) చేసిన కామెంట్‌లో నెగెటివ్ అంశమేదీ లేదు. చంద్రబాబు మంచితనం, ఇతర నాయకులపై ఆయనకు ఉన్న సదభిప్రాయం ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వానికి వెన్నెముకలా ఉన్న పవన్‌తో భవిష్యత్తులోనూ కలిసి నడిచేందుకే బాబు ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు రాజకీయ వారసుడు నారా లోకేశ్‌కు నమ్మదగిన మిత్రుడిలా పవన్ కల్యాణ్ ఉంటారని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే రానున్న కాలంలోనూ జనసేన, టీడీపీ దోస్తీకి ఢోకా ఉండకపోవచ్చు.
Also Read :Presidents Rule : మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన ? ప్రధాని మోడీ ఏం చేయబోతున్నారు ?
బీజేపీ విషయంలో..
ఇక బీజేపీ గురించి ఇప్పుడే ఏదీ చెప్పలేం. జాతీయ రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా ఆ పార్టీ ఏ క్షణంలో ఎలాంటి వ్యూహమైన అమలు చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఏపీలోని అత్యధిక అసెంబ్లీ, లోక్‌సభ సీట్లలో పోటీ చేయాలని బీజేపీ భావిస్తే.. అనూహ్య రాజకీయ సమీకరణానికి తెరలేపినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు.