Congress Candidates : కడప బరిలో షర్మిల.. 114 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు
Congress Candidates : కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది.
- By Pasha Published Date - 03:14 PM, Tue - 2 April 24

Congress Candidates : కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది. మొత్తం 114 అసెంబ్లీ స్థానాలకు హస్తం పార్టీ అభ్యర్థుల పేర్లను అనౌన్స్ చేసింది. వీటితో పాటు 5 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. ఈసారి కడప లోక్‌సభ స్థానం నుంచి వైఎస్ షర్మిల పోటీ చేయనున్నారు. కాకినాడ నుంచి పల్లంరాజు, రాజమండ్రి నుంచి గిడుగు రుద్దరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం, కర్నూల్ నుంచి రామ్ పుల్లయ్య యాదవ్ పోటీ చేయనున్నారు.
We’re now on WhatsApp. Click to Join
షర్మిల రాకతో జోష్..
ఈసారి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల్లో ఎక్కువ మంది కొత్త వారే ఉండటం గమనార్హం. కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉన్నవారికి ఛాన్స్ ఇచ్చారు. కొన్ని చోట్ల ఆసక్తి చూపిన ప్రముఖ నేతలకు అవకాశం కల్పించారు. ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకుగానూ 114 నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. తెలంగాణ నుంచి ఏపీ విడిపోయాక.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ టికెట్లకు అస్సలు పోటీ లేకుండాపోయింది. అయితే ఏపీ పీసీసీ చీఫ్ గా షర్మిల బాధ్యతలను చేపట్టాక సీన్ మారింది. కాంగ్రెస్ శ్రేణులు యాక్టివ్ అయ్యాయి. ఈసారి షర్మిల స్వయంగా కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. తొలి జాబితాలో పులివెందుల స్థానానికి ఎవరి పేరునూ ఖరారు చేయలేదు. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె లేదా ఆమె తల్లి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. వైఎస్ సునీత పోటీకి అంగీకరిస్తే ఆమె పోటీ చేసే అవకాశం ఉంది. అయితే తమ టార్గెట్ అవినాష్ రెడ్డి అని..ఆయనను ఓడించడమే లక్ష్యమని సునీతారెడ్డి అంటున్నారు. లోక్ సభకు షర్మిల పోటీ చేస్తున్నందున.. పులివెందుల నుంచి కూడా వైఎస్ కుటుంబం నుంచే ఒకరు పోటీ చేయడం ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఆ అభ్యర్థి ఎవరనే దానిపై వారం రోజుల్లో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. మొత్తం మీద ఈసారి కడప లోక్‌సభ స్థానంలో షర్మిల, అవినాష్ రెడ్డి మధ్య గట్టి పోటీ జరగడం ఖాయం.
कांग्रेस अध्यक्ष श्री @kharge की अध्यक्षता में आयोजित 'केंद्रीय चुनाव समिति' की बैठक में लोकसभा चुनाव, 2024 के लिए कांग्रेस उम्मीदवारों के नाम की 11वीं लिस्ट। pic.twitter.com/TpMaGKiSdD
— Congress (@INCIndia) April 2, 2024