Kejriwal : డాన్, గ్యాంగ్ స్టర్, టెర్రరిస్ట్.. కేజ్రీవాల్ సెల్ పక్కనే వీరంతా !!
- Author : Latha Suma
Date : 02-04-2024 - 3:08 IST
Published By : Hashtagu Telugu Desk
Aravind Kejriwal:ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో జరిగిన కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ ఢిల్లీ(Delhi)లోని తీహార్ జైల్లో(Tihar Jail) రిమాండ్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్( CM Arvind Kejriwal) ఉంటున్న విషయం తెలిసిందే.
We’re now on WhatsApp. Click to Join.
అయితే తీహార్ జైలు నంబర్ 2లోని సెల్‌లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అతని పొరుగువారిలో అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్, కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ నీరజ్ బవానా మరియు ఉగ్రవాది జియావుర్ రెహ్మాన్ ఉన్నారు.
Read Also: AP: ఎన్నికల ప్రచారంలో వైసీపీ నాయకుల తంటాలు
మరోవైపు నాలుగేళ్ల కింద వరకు ఓ వెలుగు వెలిగిన ఆమ్ ఆద్మీ పార్టీ.. ఇప్పుడు దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోతుంది. బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని ఆశించిన.. ఆప్ కీలక నేతలంతా ఇప్పుడు తీహార్ జైలులోనే ఉన్నారు. లేటెస్ట్‌గా సీఎం కేజ్రీవాల్‌తో పాటు గతంలో కీలక మంత్రులుగా పనిచేసిన ఇద్దరు లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయ్యారు. ఓ ఆప్ రాజ్యసభ సభ్యుడు కూడా జైలుకు వెళ్లాడు. ఇప్పుడున్న పలువురు మంత్రులకు కూడా నోటీసులు అందాయి. అరెస్ట్ అయిన నలుగురు నేతలు తీహార్ జైలులోనే ఉన్నారు. కేజ్రీవాల్ తీహార్ జైలు నెంబర్-2లో ఉన్నారు. మనీష్ సిసోడియా జైల్ నెంబర్-1, సత్యేంద్ర జైన్ జైల్ నెంబర్-7, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ జైల్ నెంబర్-5లో ఉన్నారు.
Read Also: Summer Foods: వేసవిలో ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన ఫుడ్ ఇదే..!
కాగా, ఢిల్లీ మద్యం కేసు లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలు కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ కేసులో కేజ్రీకి స్థానిక రౌస్ అవెన్యూ కోర్టు 15 రోజులపాటు జుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో సోమవారం సాయంత్రం కేజ్రీని అధికారులు తీహార్ జైలుకు తరలించారు.