HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Cm Ys Jagan Gift To Secretariat Employees

YS Jagan : ఉద్యోగుల గొంతెమ్మ కోర్కెల‌కు జ‌గ‌న్ జై

ఏపీ ఉద్యోగులు కోరిన గొంతెమ్మ కోర్కెల‌ను జ‌గ‌న్ స‌ర్కార్ అంగీక‌రించింది. ప్ర‌భుత్వ ఉద్యోగి చనిపోతే అంత్య‌క్రియ‌ల కోసం ఇచ్చే 15వేల‌ను రూ.25 వేలకు పెంచుతూ ఉత్తర్వులిచ్చింది.

  • Author : Hashtag U Date : 12-05-2022 - 1:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ys Jagan Ysrcp
Ys Jagan Ysrcp

ఏపీ ఉద్యోగులు కోరిన గొంతెమ్మ కోర్కెల‌ను జ‌గ‌న్ స‌ర్కార్ అంగీక‌రించింది. ప్ర‌భుత్వ ఉద్యోగి చనిపోతే అంత్య‌క్రియ‌ల కోసం ఇచ్చే 15వేల‌ను రూ.25 వేలకు పెంచుతూ ఉత్తర్వులిచ్చింది. దీనితో పాటు వాళ్లు చేసిన ప్ర‌ధాన‌ డిమాండ్ మేర‌కు ఐఆర్ రికవరీ లేకుండా పీఆర్సీని అమలు చేయ‌డానికి జ‌గ‌న్ స‌ర్కార్ సిద్ధం అయింది. దానికి సంబంధించిన పీఆర్సీ అనుబంధ జీవోను సర్కారు విడుదల చేసింది. 27 శాతం ఐఆర్ లబ్ధి పొందినంత కాలం ఇది వర్తిస్తుందని జీవో లో పేర్కొ్నారు. ఇంతకుముందు వరకు రూ.15 వేలు ఇస్తున్న మొత్తాన్ని పెంచింది. ఉద్యోగుల బీమా వడ్డీ శాతాన్నీ ప్రభుత్వం సవరించింది.

పీఆర్సీలో పేర్కొన్న రూల్ 7కు అనుబంధంగా 7ఏ రూల్ ను జోడించింది. టైమ్ స్కేల్ దాటినా ఐదు స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లను ఇస్తామని ప్రకటించింది. ప్రమోషన్లు, ఆటోమేటిక్ అడ్వాన్స్ మెంట్ స్కీమ్, పింఛన్లకు సంబంధించి వాటిని సాధారణ పెంపుగానే పరిగణిస్తూ జీవో విడుద‌ల అయింది. గరిష్ఠ వేతన పరిమితిని చేరిన ఉద్యోగులకు ఐదు స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లను అమలు చేయాల్సిందిగా 11వ వేతన సవరణ కమిషన్ సూచించింది. కానీ, ప్రభుత్వం ఐఆర్ ను రికవరీ చేయబోమంటూ వెల్లడించింది.2019 జులై నుంచి 2020 మార్చి 31 వరకు చెల్లించిన ఇంటీరియమ్ రిలీఫ్ ను రికవరీ చేయకూడదంటూ ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీ సిఫార్సు చేసిందని, వారి సిఫార్సులను పరిగణనలోకి తీసుకొని ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా ఐఆర్ ను రికవరీ చేయరాదన్న నిర్ణయానికి వచ్చామని జీవోలో ప్రభుత్వం పేర్కొంది.

వేతన సవరణ తర్వాత ఉండే బకాయిలను 2020 ఏప్రిల్ నుంచి 2021 డిసెంబర్ మధ్య కాలానికి సంబంధించి సిస్టమ్ ద్వారా జనరేట్ అయిన డ్యూ డ్రాన్ (బకాయి ఉన్న మొత్తం, డ్రా చేసుకున్న మొత్తం) స్టేట్మెంట్లతో లెక్కిస్తామని చెప్పింది. వాటిని సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత సర్వీసు రిజిస్టర్ లో నమోదు చేస్తామని పేర్కొంది. ఆ బకాయిలన్నింటినీ ఉద్యోగి పదవీ విరమణ చేసే సమయానికి చెల్లిస్తామని తెలిపింది. డ్యూ డ్రాన్ స్టేట్ మెంట్లకు సంబంధించిన సవివరణాత్మకంగా ప్రత్యేక ఉత్తర్వులను జారీ చేస్తామని పేర్కొంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP secretariat
  • YS Jagan Mohan Reddy

Related News

Ambati Rambabu

అంబటి రాంబాబు అనే కుక్కకీ ఒక రోజొస్తుంది

Ambati Rambabu  వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ప్రతి కుక్కకూ ఒక రోజొస్తుంది. ఈ రాంబాబు అనే కుక్కకు కూడా ఓ రోజు వస్తుంది. అప్పుడు తగ్గనే తగ్గను’ అని ఆయన ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న ఆయన, బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. అనం

  • Ap Legislative Council

    మండలిలో కొత్త రచ్చ.. దేవుడి చిత్రాలతో వైసీపీ రాజకీయం

Latest News

  • విద్యార్థుల తల్లిదండ్రులకు సీఎం రేవంత్ తీపికబురు

  • Telangana Budget 2026-27 : తెలంగాణ సర్కార్ కు సవాల్ గా మారిన ‘ బడ్జెట్ 2026-27’

  • Anil Ravipudi New Project : ఈసారి నందమూరి హీరోతో వెంకీ ని కలిపిన అనిల్ రావిపూడి

  • సీఎం రేవంత్ ’99 రోజుల’ ప్రణాళిక సిద్ధం

  • టీమిండియా బ్యాటర్ రింకూ సింగ్ ఇంట విషాదం!

Trending News

    • టీమిండియాను టెన్ష‌న్ పెడుతున్న వెస్టిండీస్‌!

    • గుడ్ న్యూస్‌.. గాలి లేకుండానే నడిచే టైర్!!

    • SA vs WI మ్యాచ్‌లో ఎవరి గెలుపు భారత్‌కు ముఖ్యం?

    • కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం.. కార‌ణ‌మిదే?!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భార‌త్‌కు సౌతాఫ్రికా సాయం చేయ‌నుందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd