HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Cm Ys Jagan Comments On Janasena Vizag Violence

YS Jagan : ప‌వ‌న్ విశాఖ టూర్ పై జ‌గ‌న్ `విద్వేష` మాట‌

జ‌న‌సేనాని ప‌వ‌న్ మీద ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఫైర్ అయ్యారు. క‌ర్నూలు జిల్లా ఆళ్ల‌గ‌డ్డ వేదిక‌గా ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చ‌గొట్టేలా జ‌న‌సేనాని వ్య‌వ‌హిస్తున్నార‌ని ఆరోపించారు.

  • Author : Hashtag U Date : 17-10-2022 - 2:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

జ‌న‌సేనాని ప‌వ‌న్ మీద ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఫైర్ అయ్యారు. క‌ర్నూలు జిల్లా ఆళ్ల‌గ‌డ్డ వేదిక‌గా ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చ‌గొట్టేలా జ‌న‌సేనాని వ్య‌వ‌హిస్తున్నార‌ని ఆరోపించారు. దుష్ట‌చ‌తుష్ట‌యానికి ప‌వ‌న్ తోడ‌య్యాడ‌ని దుయ‌బ‌ట్టారు. దత్తపుత్రుడితో కలిసి ఆ నలుగురు దోచుకో-పంచుకో-తినుకో విధానంను చంద్ర‌బాబు హ‌యాంలో అమలు చేశార‌ని తీవ్ర ఆరోప‌ణ‌ల‌ను గుప్పించారు.

ప్ర‌స్తుతం ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా లబ్ది దారుని ఎకౌంట్ లో నగదు జమ అవుతుందని జ‌గ‌న్ వివ‌రించారు. చంద్రబాబు పాలనలో ప్రతీ ఏటా కరువు మండలాల ప్రకటన చేయాల్సి వచ్చేదని సెంటిమెంట్ పాయింట్ తీశారు. క‌రువు, బాబు స్నేహితులంటూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విమ‌ర్శించారు. ఆళ్లగడ్డ వేదికగా వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ పథకంలో భాగంగా ఈ ఏడాది రెండో విడత నిధులను సీఎం విడుదల చేసారు. మొత్తం 50.92 లక్షల మంది రైతులకు రూ 2,096.04 కోట్లు ఈ విడతలో అంద‌నుందని వెల్ల‌డించారు. ఒక్కో రైతు కుటుంబానికి రూ 13,500 చొప్పున ఇప్పటి వరకు 51 వేలు అందించామని సీఎం వివరించారు.

ఏపీ ఆర్థిక ప‌రిస్థితి గురించి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆళ్ల‌గడ్డ వేదిక‌పై ప్ర‌స్త‌వించారు. గ‌తంలో చంద్ర‌బాబు తీసుకున్న రుణాల కంటే ప్ర‌స్తుతం ఎక్కువ‌గా లేద‌ని వివ‌రించారు. వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తులు పెరిగాయ‌ని, ప్ర‌భుత్వానికి రాబడి కూడా పెరుగుతుంద‌ని అన్నారు. ఉద్దేశపూర్వ‌కంగా రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఒక సెక్ష‌న్ ఆఫ్ మీడియా టార్గెట్ చేస్తుంద‌ని తెలిపారు. ఆ ప్ర‌చారాన్ని న‌మ్మొద్ద‌ని ప్ర‌జ‌ల‌కు ఆయ‌న తెలియచేశారు. ద‌త్త‌పుత్రుడుగా ఉన్న ప‌వ‌న్ ఆ మీడియాతో కలిసి న‌డుస్తున్నాడ‌ని ఆరోపించారు. మొత్తం మీద విశాఖ గ‌ర్జ‌న క్ర‌మంలో ప‌వ‌న్ చేసిన హ‌డావుడిపై ప‌రోక్షంగా జ‌గ‌న్ స్పందించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap political
  • janasena violence
  • janavani programme
  • Pawan Kalyan
  • YS Jagan Mohan Reddy

Related News

Pawan Kalyan

పవన్ కళ్యాణ్ ను రోజు తిడితే ఎమ్మెల్సీ పదవి !!

గతంలో ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి తనను పిలిపించి, ఎమ్మెల్సీ (MLC) పదవి ఆఫర్ చేశారని ఆయన పేర్కొన్నారు. అయితే, ఆ పదవి దక్కాలంటే ప్రతిరోజూ ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్‌ను విమర్శించాలనే షరతు పెట్టారని, దానికి తాను ససేమిరా అన్నట్లు బండ్ల గణేష్ వివరించారు

  • Pawan Kalyan Campaign In Mu

    తెలంగాణ మున్సిపల్ బరిలోకి దిగుతున్న పవన్ కళ్యాణ్

  • Bolli Shetty Satyanarayana

    జనసేనకు బిగ్ షాక్ ఇచ్చిన కీలక నేత..అయోమయంలో పార్టీ శ్రేణులు !!

  • Pawan Is Angry Over Liquor

    మద్యం ధరలపై పవన్ ఆగ్రహం !!

  • Pawan Praises Modi's Leader

    మోడీ నాయకత్వంపై పవన్ ప్రశంసలు..ఫిదా అంటున్న బిజెపి శ్రేణులు

Latest News

  • బంగారం వెండి ధరలకు రెక్కలు ..రూ.6 వేలు పెరిగిన బంగారం, రూ.14 వేలు పెరిగిన వెండి

  • భర్త – ప్రియుడితో కలిసి రెండో ప్రియుడిని హత్య చేసిన మహిళ..ఈమె మామూలు ఆడది కాదు !!

  • పానీపూరీ కోసం ఎగబడ్డ యూఎస్ఏ ప్లేయర్స్

  • మరణానికి ముందు అతనికి ఫోన్ కాల్.. అజిత్ పవార్ చివరి మాటలు ఇవే !

  • టీ20 వరల్డ్ కప్ పై ? ఎంఎస్ ధోనీ షాకింగ్ కామెంట్స్..

Trending News

    • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

    • వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

    • పాకిస్థాన్‌పై ఐసీసీ క‌ఠిన చ‌ర్య‌లు?!

    • పీఎఫ్ ఖాతాదారుల‌కు మ‌రో శుభ‌వార్త‌..!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. టీమ్ ఇండియా, ఇండియా A వార్మప్ మ్యాచ్‌ల వివరాలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd