CJ interesting Comments: జగన్ తెలుగు… చీఫ్ జస్టిస్ ఫిదా..!!
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి...ఇంగ్లీష్ లో ఇరకగదీస్తాడు. పాశ్చాత్య యాస గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.
- By hashtagu Published Date - 02:19 PM, Sat - 20 August 22

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి…ఇంగ్లీష్ లో ఇరకగదీస్తాడు. పాశ్చాత్య యాస గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. జగన్ మాట్లాడే ఇంగ్లీస్ పదబంధాలు చాలా గంభీరంగా ఉంటాయి. ఇంగ్లీష్ భాష మీద జగన్ ఎంతో పట్టుంది. ఆయన ఏం చదువుకున్నారు అనే ప్రశ్నకు ఆయన ఇంగ్లీష్ చూస్తే వాహ్హ అనాల్సిందే. కానీ జగన్ రాజకీయాల్లోకి వచ్చాక ఎక్కువగా తెలుగులోనే మాట్లాడుతున్నారు. కొన్ని సందర్భాల్లో తెలుగులో కొన్ని పదాలు పలకలేక ఇబ్బందులు పడుతుంటారు. అయినా కూడా తెలుగులో మాట్లాడేందుకే ఆసక్తి చూపిస్తుంటారు. ఇదిలా ఉండగా ఇవాళ విజయవాడలో నూతన కోర్టు భవనాల ప్రారంభోత్సవం జరిగింది. అక్కడున్న న్యాయమూర్తులంతా మేధావులు. అక్కడంతా ఇంగ్లీష్ లోనే మాట్లాడారు. ఇక సీఎం జగన్ సమయం వచ్చింది.
సాధారణంగా జగన్ ఇంటలెక్చువల్స్ ఉన్న సభల్లో ఇంగ్లీష్ లోనే మాట్లాడతారు. కానీ దానికి భిన్నంగా ఈసారి జగన్ తెలుగులో మాట్లాడి…తెలుగులోనే ముగించారు. అక్కడున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీరమణ…జగన్ తెలుగులో మాట్లాడుతుంటే అలా వింటూ ఉండిపోయారు. తర్వాత చీఫ్ జస్టిస్ కూడా తెలుగులోనే మాట్లాడారు. దానికి ఎన్వీ రమణ చెప్పిన కారణం ఏంటంటే…జగన్ తెలుగులో మాట్లాడారు. నేను మాట్లాడకపోతే ఎలా…బాగుండదు కదా అంటూ చమత్కరించారు. ఇంకో విశేషం ఏంటంటే ఎన్వీ రమణ తెలుగు భాషాభిమాని. ఆయనకు తెలుగులో మాట్లాడేవారంటే చాలా మక్కువ. ఇక మొత్తానికి జగన్ తెలుగులో మాట్లాడి చీఫ్ జస్టిస్ ను ఫిదా చేయారనే చెప్పాలి.