AP : ఏపి పదోతరగతి పరీక్ష ఫలితాలు విడుదల
- By Latha Suma Published Date - 11:36 AM, Mon - 22 April 24

AP SSC Results: ఏపీలో పదో తరగతి ఫలితాలను ఏపీ విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ విడుదల చేశారు. ఈ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https:// results. bse.ap.gov.in/ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ఏడాది 7లక్షల మందికి పైగా విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాశారు.
We’re now on WhatsApp. Click to Join.
6.23 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 86.69 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో బాలికలదే పైచేయి సాధించారు.
బాలుర ఉత్తీర్ణత శాతం: 84.32
బాలికల ఉత్తీర్ణత శాతం: 89.17
కాగా, మార్చి 18 నుంచి 30వ తేదీ వరకూ పది పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఎనిమిది వరకూ మూల్యాంకనం నిర్వహించారు. మొత్తం 47,88,738 జవాబు పత్రాల వేల్యుయేషన్ కోసం 25 వేల మంది టీచర్లను నియమించి 26 జిల్లాల్లో సెంటర్లను నిర్వహించడం జరిగింది. దీంతో 22 రోజుల్లోనే వాల్యుయేషన్ పూర్తి చేసి, ఇవాళ విడుదల చేస్తున్నారు. ఇందుకు ఎన్నికల సంఘం కూడా అనుమతి ఇచ్చింది. గతేడాది కంటే.. ముందుగానే ఈసారి ఫలితాలు వచ్చేశాయి.
Read Also: AP Congress MP 3rd List : ఏపీ కాంగ్రెస్ మూడో జాబితా విడుదల