HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Capital Farmers And Jai Bheem Protestors On R5 Zone In Amaravati

AP Capital : అమ‌రావ‌తిలో R-5! జై భీమ్, కొల‌క‌ల‌పూడి పోరు!!

అమ‌రావ‌తి రాజ‌ధానికి(AP Capital) భూములు ఇచ్చిన వాళ్లు మాజీ సీఎం చంద్ర‌బాబునాయుడు సామాజిక‌వ‌ర్గం అంటూ వైసీపీ దుమ్మెత్తిపోసింది.

  • Author : CS Rao Date : 24-05-2023 - 3:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap Capital
Ap Capital

అమ‌రావ‌తి రాజ‌ధానికి(AP Capital) భూములు ఇచ్చిన వాళ్లు మాజీ సీఎం చంద్ర‌బాబునాయుడు సామాజిక‌వ‌ర్గం అంటూ వైసీపీ దుమ్మెత్తిపోసింది. రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవ‌డానికి ఇచ్చార‌ని ప్ర‌చారం చేసింది. అసెంబ్లీ బ‌య‌ట‌, లోప‌ల భూములు ఇచ్చిన వాళ్ల జాబితాను టీడీపీ(TDP) బ‌య‌ట పెట్టింది. క‌మ్మ సామాజిక‌వ‌ర్గం కంటే ఎస్సీ, బీసీలు ఎక్కువ‌గా ఉన్నార‌ని తేలింది. ఆ త‌రువాత ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్ అంటూ నిరాధార ఆరోప‌ణ‌ల‌ను చేస్తూ ఏపీ సీఐడీని రంగంలోకి దింపారు. నాలుగేళ్లు అవుతున్న‌ప్ప‌టికీ ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్ ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ తేల్చ‌లేక‌పోయింది.

ఆర్ -5 జోన్ పై  ఉద్య‌మానికి (AP Capital)

మూడేళ్లుగా అమరావ‌తి(AP Capital) ఉద్య‌మం చేస్తున్న వాళ్లు కూడా క‌మ్మ సామాజిక‌వ‌ర్గం పెయిడ్ బ్యాచ్ అంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా వైసీపీ ప్ర‌చారం చేసింది. ఎప్ప‌టిక‌ప్పుడు పోలీసులు ఉక్కుపాదం మోపిన‌ప్ప‌టికీ రైతులు ఉద్య‌మాన్ని వీడ‌లేదు. వాళ్ల‌ను గ‌త రెండేళ్లుగా కొల‌క‌ల‌పూడి శ్రీనివాస్ (Kolikalapudi Srinivas)ముందుండి న‌డిపిస్తున్నారు. ఆయ‌న ఎస్సీ సామాజిక‌వ‌ర్గం. అంతేకాదు, న్యాయ‌వాది, జై భీమ్ భార‌త్ పార్టీ అధ్య‌క్షుడు జ‌డ శ్ర‌వ‌ణ్ కుమార్(Jada Sravan) అమరావ‌తి రాజ‌ధాని కోసం క్షేత్ర‌స్థాయి పోరాటానికి దిగారు. ఆయ‌న కూడా ఎస్సీ సామాజిక‌వ‌ర్గం. అటు కొల‌క‌ల‌పూడి ఇటు జ‌డ అమ‌రావ‌తి ఉద్య‌మాన్ని నెత్తికెత్తుకున్నారు. సివిల్స్ కోచింగ్ సెంట‌ర్ ను నిర్వ‌హించుకుంటోన్న శ్రీనివాస్ గ‌త రెండేళ్లుగా పూర్తి స్థాయిలో అమ‌రావ‌తి కోసం పోరాడుతున్నారు. ఇక న్యాయ‌వాది శ్ర‌వ‌ణ్ ఎప్ప‌టిక‌ప్పుడు మీడియా వేదిక‌గా అమ‌రావ‌తి వాయిస్ ను బ‌లంగా వినింపించారు.

తుళ్లూరులో 48 గంటల దీక్షకు పిలుపు

అమ‌రావ‌తి (AP Capital ) రైతుల‌కు మాత్ర‌మే కాదు, రాష్ట్రానికి జ‌రుగుతోన్న అన్యాయంపై ఎస్సీ నాయ‌కులుగా ఇద్ద‌రూ గ‌ళం విప్పారు. ప్ర‌త్య‌క్ష పోరాటానికి దిగారు. ఇప్పుడు వైసీపీ ఏ సామాజిక‌వ‌ర్గం ఉద్య‌మం చేస్తుంద‌ని చెబుతుంది? ఆర్ -5 జోన్ పై వాళ్లిద్ద‌రూ ఉద్య‌మానికి పూనుకున్నారు. సింగ‌పూర్ క‌న్సార్టియంతో సీఆర్డీయే చేసుకున్న ఒప్పందం క‌నుమ‌రుగు అవుతుంద‌ని ఆందోళ‌న‌కు బాట ప‌ట్టారు. ఫ‌లితంగా తుళ్లూరులో(Thulluru) ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్-5 జోన్ కు వ్యతిరేకంగా జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ తుళ్లూరులో 48 గంటల దీక్షకు పిలుపునిచ్చారు. దీక్షకు వచ్చిన శ్రవణ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని తుళ్లూరు పోలీస్ స్టేష‌న్ కు తరలించారు.

టీడీపీ నేతలను పోలీసులు గృహనిర్బంధం

ఆర్‌-5 జోన్‌ను వ్యతిరేకిస్తూ గుంటూరు జిల్లా తుళ్లూరులో తెనాలి శ్రావణ్ కుమార్‌ నిరసన చేపట్టారు. ఇదే టైంలోనే వైస్సార్సీపీ మద్దతు దారులు ఆర్‌-5 జోన్‌లో ఇళ్లు కేటాయింపును సమర్ధిస్తూ కృతజ్ఞత ర్యాలీకి దిగారు. ఇరువర్గాల ర్యాలీలతో పరిస్థితి అదుపు త‌ప్పుతుంద‌ని తుళ్లూరులో 144 సెక్షన్ పెట్టారు. నిర‌స‌న‌లు, ర్యాలీలు, దీక్ష‌ల‌ను నిషేదిస్తూ పోలీసులు ఆందోళ‌న‌కారుల‌ను అరెస్ట్ చేశారు. దీంతో వాళ్ల‌కు సంఘీభావంగా రైతులు రంగంలోకి దిగారు. ఆందోళ‌న‌కారుల‌ను అరెస్టు చేసి వాహనాల్లో తుళ్ళూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు.

Also Read : ‘R5’ riot in Amaravati: అమరావతిలో ‘ఆర్‌ 5’ అలజడి

పోలీసుల ఆంక్షల న‌డుమ తుళ్లూరులో ఆర్-5 మండలంలో టీడీపీ ఆధ్వర్యంలో రైతులు నిరసనకు దిగారు. నిరసనకు వచ్చిన రైతులను అదుపులోకి తీసుకున్నారు. మహిళలు, వృద్ధులను బలవంతంగా నిరసన వేదిక నుంచి పోలీసులు త‌ర‌లించారు. వారిలో హైకోర్టు సీనియర్ న్యాయవాది, జై భీం భారత్(Jai Bheem Bharat) పార్టీ అధ్యక్షుడు జడా శ్రవణ్ కుమార్ కూడా ఉన్నారు. నిరసన ప్రదేశంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వేదిక ప్రాంతంలోకి ఎవరూ ప్రవేశించకుండా కఠిన చర్యలు తీసుకున్నారు. మరోవైపు తుళ్లూరు మండలంలో పలువురు టీడీపీ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు.

Also Read : AP Capital : జ‌గ‌న్నాట‌కంలో అమ‌రావ‌తి

ద‌ళిత, మ‌హిళా రైతులు పెద్ద ఎత్తున ఈ దీక్ష‌కు త‌ర‌లి వ‌చ్చారు. ఇటీవ‌ల దాకా ఒక సామాజిక‌వ‌ర్గానికి చెందిన రాజ‌ధానిగా (AP Capital) చెబుతూ వ‌చ్చిన వైసీపీ క‌ళ్లు తెరిపించేలా నిర‌స‌న‌దీక్ష‌కు వివిధ సామాజికవ‌ర్గాలు హాజ‌రు కావ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌త్యేకించి కొల‌క‌లపూడి, జ‌డ శ్రావ‌ణ్ లీడ్ చేయ‌డంతో అమ‌రావ‌తి ఉద్య‌మం మ‌రో మైలురాయికి చేరుతుంద‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టికే మ‌హాపాద‌యాత్ర‌ను ముందుండి న‌డిపించిన శ్రీనివాస్, దాన్ని హైలెట్ చేసేలా మీడియాలో గ‌ళం వినిపించిన జ‌డ ఉద్య‌మాల‌ను చూస్తున్నాం. ఇప్పుడు ఆర్ 5 జోన్ వ్య‌వహారంపై ఇద్ద‌రూ ఉద్య‌మాన్ని తారాస్థాయికి తీసుకెళ్ల‌డానికి సిద్ద‌మ‌య్యారు. ఈ ఉద్య‌మంలో ఎస్సీలు ఎక్కువ‌గా ఉండ‌డం గ‌మ‌నార్హం.

Also Read : Amaravathi Farmers : అమ‌రావ‌తి రైతుల `త్యాగం`కు జ‌గ‌న్ గొళ్లెం!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Amaravathi Capital
  • ap capital
  • police action
  • zone 5

Related News

amaravati farmers land allotment

Amaravati : ఇకపై అమరావతి స్పెల్లింగ్‌ అలాగే రాయాలి – అధికారులకు ఏపీ సర్కార్ ఆదేశాలు..!!

ఇకపై అధికారికంగా 'Amaravati' అనే స్పెల్లింగ్‌ను మాత్రమే వాడాలని స్పష్టం చేసింది. గతంలో కొంతమంది 'Amaravathi' అని, మరికొందరు 'Amaravati' అని వేర్వేరుగా రాస్తుండటంతో అధికారిక ఉత్తర్వులు, ఫైళ్లు మరియు గెజిట్‌లలో గందరగోళం నెలకొనేది

  • Amaravati

    Amaravati: అమరావతి పేరు మార్పు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు.

Latest News

  • Simhachalam Chandanotsavam : నేడు సింహాద్రి అప్పన్న చందనోత్సవం

  • చంద్రబాబుకు ప్రధాని మోదీ బర్త్ డే విషెస్

  • Anna Canteens : చంద్రబాబు బర్త్ డే సందర్బంగా అన్న క్యాంటీన్లలో ఉచితంగా భోజనం

  • బీజేపీ మాజీ ఎంపీ మృతి.. పీఎం మోదీ సంతాపం

  • అజింక్యా ర‌హానే ఖాతాలో మ‌రో చెత్త రికార్డు!

Trending News

    • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

    • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

    • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

    • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

    • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd