AP Cabinet Meeting : రేపు ఏపీ క్యాబినెట్ భేటీ
AP Cabinet Meeting : ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చలు జరుగుతాయని ప్రభుత్వం వర్గాలు తెలిపాయి
- By Sudheer Published Date - 09:26 AM, Thu - 16 January 25

రేపు ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (AP Cabinet Meeting) జరుగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చలు జరుగుతాయని ప్రభుత్వం వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో మంత్రులు తల్లికి వందనం పథకం, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రైతు భరోసా హామీల అమలు వంటి పలు ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నారు. ఈ పథకాలు రాష్ట్రానికి ఎంతో లాభాలు చేకూరుస్తాయని భావిస్తున్నారు. ఈ క్రమంలో వీటిపై అమలు పై రేపు భేటీ లో చర్చలు జరపనున్నారు.
Saif Ali Khan : సైఫ్ అలీఖాన్ పై దాడి
అలాగే పలు కంపెనీలకు భూములు కేటాయించడానికి ఆమోదముద్ర వేయాలని నిర్ణయించనున్నట్లు సమాచారం. ఈ భూముల కేటాయింపు ప్రక్రియలో ఆర్థిక, సామాజిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమావేశం తరువాత ప్రభుత్వ వర్గాలు తీసుకున్న నిర్ణయాలపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ భేటీ ముఖ్యంగా రాష్ట్ర ప్రజల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధి పట్ల ప్రభుత్వ ఆలోచనలను మరోసారి స్పష్టం చేసేలా ఉంటుందనే భావన వ్యక్తమవుతోంది.