AP Cabinet Meeting Key Decisions : ఏపీ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు
మాజీ సీఎం జగన్ బొమ్మ, పేరు ఉన్న సర్వే రాళ్లను ఏం చేయాలనే అంశంపై మంత్రి వర్గ సమావేశంలో చర్చించగా... బొమ్మల పిచ్చితో నాటి సీఎం 700 కోట్లు రూపాయలు వృధా చేసారని
- By Sudheer Published Date - 04:15 PM, Wed - 7 August 24

సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం(AP Cabinet Meeting Key Decisions) లో కీలక నిర్ణయాలు తీసుకుంది. మాజీ సీఎం జగన్ బొమ్మ, పేరు ఉన్న సర్వే రాళ్లను ఏం చేయాలనే అంశంపై మంత్రి వర్గ సమావేశంలో చర్చించగా… బొమ్మల పిచ్చితో నాటి సీఎం 700 కోట్లు రూపాయలు వృధా చేసారని, వెంటనే ఆ బొమ్మలను తొలగించాలని పలువురు మంత్రులు సూచించగా..కేబినెట్ ఆమోదం తెలిపింది. రాజముద్ర ఉన్న కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీకి కెబినెట్ నిర్ణయం తీసుకున్నది. జగన్ బొమ్మలతో ఉన్న పాసు పుస్తకాలను వెనక్కు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే స్థానిక సంస్థలు, సహకార సంఘాల్లో ముగ్గురు పిల్లలుంటే పోటీకి అనర్హత నిబంధనను తొలగించాలని నిర్ణయం తీసుకుంది.
We’re now on WhatsApp. Click to Join.
జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఎక్సైజ్ అవకతవకలపై సైతం కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. 2014-19, 2019-24 మధ్య తీసుకువచ్చిన ఎక్సైజ్ పాలసీలపై కూడా చర్చించారు. ప్రస్తుత ఎక్సైజ్ పాలసీని తప్పించి.. కొత్త ఎక్సైజ్ పాలసీ రూపొందించేందుకు సైతం కెబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎక్సైజ్ ప్రొక్యూర్మెంట్ పాలసీలో కూడా మార్పులు తేవాలని కెబినెట్ సూచించింది. ఇంకా.. మత్స్యకారులకు నష్టం చేకూర్చేలా గత ప్రభుత్వం ఇచ్చిన 217 జీవో రద్దు చేసింది. మావోయిస్టులపై మరో ఏడాది పాటు నిషేధం విధించేలా కేబినెట్ తీర్మానం చేసింది.
కేబినెట్ భేటీలో (AP Cabinet Meeting Key Decisions) తీసుకున్న కీలక నిర్ణయాలు :
మావోయిస్టులపై మరో ఏడాదిపాటు నిషేధం పొడిగింపు
పశుసంవర్థక శాఖ, మత్స్యశాఖలు విడుదల చేసిన 217,144 జీఓలు రద్దు
నూతన మెడికల్ కాలేజీల్లో 100 సీట్లతో MBBS కోర్సులు
గుజరాత్ లోని పీపీపీ మోడల్ ను అధ్యయనం చేయాలని సీఎం ఆదేశం
కొత్త మద్యంపాలసీ రూపకల్పన
రాష్ట్రంలోకి అక్రమ మద్యం రాకుండా చర్యలు
జగన్ ఫొటో ఉన్న పాసుపుస్తకాలను వెనక్కి తీసుకుని రాజముద్ర ఉన్న పాసు పుస్తకాలు ఇవ్వడం
త్వరలో రెవెన్యూ, గ్రామ సభల నిర్వహణ
జిల్లాల్లో రెవెన్యూ అధికారులు తిరగాలని ఆదేశం
సున్నిపెంటలో గత ప్రభుత్వం కేటాయించిన భూమిని రద్దు చేస్తూ తీర్మానం
సర్వే రాళ్లపై జగన్ బొమ్మ, పేరును తొలగించేందుకు కేబినెట్ ఆమోదం
Read Also : NTR-Allu Arjun : ఒకే వేదికపై అల్లు అర్జున్ – ఎన్టీఆర్ లు ..?