AP Cabinet Key Decisions : రూ. 99 లకే క్వార్టర్ మద్యం – కేబినెట్ నిర్ణయం
ap cabinet meeting decisions : రూ.99కే నాణ్యమైన మద్యం అందుబాటులోకి తేవడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్
- Author : Sudheer
Date : 18-09-2024 - 6:02 IST
Published By : Hashtagu Telugu Desk
AP Cabinet Key Decisions : ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన ఈరోజు(బుధవారం) ఏపీ క్యాబినెట్ సమావేశం (Cabinet Meeting) జరిగింది. ఉదయం 11గంటలకు ఈ సమావేశం మొదలుకాగా.. సాయంత్రం వరకు సుదీర్ఘంగా జరిగింది. ఈ సమయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వలంటీర్ల పునరుద్దరణపై మరింత సమాచారం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.నిబంధనలకు విరుద్ధంగా సాక్షికి జరిపిన చెల్లింపులపై విచారణకు ఆదేశాలు జారీచేశారు. ప్రైవేట్ మద్యం దుకాణాలకు అనుమతిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.99కే నాణ్యమైన మద్యం అందుబాటులోకి తేవడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అలాగే వరద సాయం ప్యాకేజీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. చట్ట సభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిసైడ్ చేసారు. భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేస్తూ కేబినెట్ తీర్మానించింది. కౌలు రైతులకు పంట నష్టపరిహారం దక్కేలా చూడాలని నిర్ణయించారు. బుడమేరు వరద ముంపుకు గురైన ఇళ్లలో యజమానులకు అద్దెకు ఉంటూ సామాన్లు పాడైన బాధితుల్ని గుర్తించి ఇవ్వాలని నిర్ణయించారు. వరదలు అధిక వర్షాల వల్ల పంట నష్టపరిహారం చెల్లింపు కౌలు రైతులకు దక్కేలా చూడాలని మంత్రివర్గం నిర్ణయించింది.
Read Also : One Nation- One Election: వన్ నేషన్- వన్ ఎలక్షన్ అంటే ఏమిటి? ప్రయోజనాలు, అప్రయోజనాలు ఇవేనా..?