Heavy Rains :ఏపీకి అలర్ట్…బంగాళాఖాతంలో వాయుగుండం. భారీ వర్షాలు కురిసే ఛాన్స్..!!
- By Bhoomi Published Date - 07:19 AM, Mon - 21 November 22

ఏపీకి భారీ వర్ష సూచన ఉందని వాతావరణశాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం స్థిరంగా కొనసాగుతున్ననేపథ్యంలో ఏపీలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు పేర్కొంది. వర్షాలతోపాటు వాతావరణం కూడా మరింత చల్లగా మారుతుందన్నారు.
ఈ వాయుగుండం రానున్న 48 గంటల్లోఏపీ తీరానికి దగ్గరగా రానున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. చేపలవేటకు వెళ్లే వారు సముద్రంలోకి వెళ్లద్దని హెచ్చరించింది. రైతులు కూడా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
Related News

Rains: ఏపీ ప్రజలకు వెదర్ అలర్ట్.. మూడు రోజులపాటు వర్షాలు
ఏపీ (Andhra pradesh) ప్రజలకు వెదర్ అలెర్ట్. ఓ వైపు చలితో వణికిపోతున్న ప్రజలను వర్షాలు ముంచెత్తనున్నాయి. రానున్న 3 రోజుల్లో ఏపీ (Andhra pradesh)లో వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి నుండి మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.