Black Day – Friday : బ్లాక్ డే – ఫ్రైడే.. చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగుల మరో వినూత్న నిరసన
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మొదటి రోజు నుంచి ఐటీ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు.
- By Prasad Published Date - 07:42 AM, Thu - 12 October 23

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మొదటి రోజు నుంచి ఐటీ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనలు వివిధ రూపాల్లో చేస్తున్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరులో ఐటీ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. చంద్రబాబు అభివృద్ధి చేసిన ప్రాంతాల్లో ఐటీ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేసి తమ మద్దతు తెలిపారు. మరోవైపు రాజమండ్రిలో ఉన్న నారా భువనేశ్వరిని కలిసి ఐటీ ఉద్యోగులు సంఘీభావం తెలిపారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టిన ఐటీ ఉద్యోగులు రాజమండ్రి చేరుకుని భువనేశ్వరిని కలిశారు. అయితే తాజాగా మరో వినూత్ని కార్యక్రమానికి ఐటీ ఉద్యోగులు శ్రీకారం చుట్టారు. బ్లాక్ డే.. ఫ్రైడే కార్యక్రామాన్ని నిర్వహించనున్నారు. ఐటీ ఉద్యోగుల అంతా చంద్రబాబుకు మద్దతుగా శుక్రవారం బ్లాక్ డ్రెస్‌లతో ఆఫీస్‌లకు వెళ్లాలని నిర్ణయించారు.
We’re now on WhatsApp. Click to Join.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టై నెల రోజులు దాటింది. అయితే ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లను కోట్టేసింది. ఇటు సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ జరుగుతుంది. రేపు ఈ పిటిషన్‌పై వాదనలు కొనసాగనున్నాయి. 17ఏ అంశంపై ప్రధానంగా వాదనలు జరగుతున్నాయి. చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. ఏపీలో వివిధ రూపాల్లో టీడీపీ నేతలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Durga Temple EO : దుర్గగుడిలో ఈవో సీటుపై లొల్లి.. కొత్త ఈవోకి బాధ్యతలు ఇవ్వని పాత ఈవో