Rs 41 In Account : ఏపీ మహిళ చీటింగ్.. లగ్జరీ హోటల్‌కు 6 లక్షలు కుచ్చుటోపీ.. అకౌంట్లో రూ.41
Rs 41 In Account : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఝాన్సీరాణి అనే మహిళ ఢిల్లీలోని ఏరోసిటీలో ఉన్న విలాసవంతమైన పుల్‌మాన్ హోటల్‌కు వెళ్లింది.
- By Pasha Published Date - 09:10 AM, Wed - 31 January 24

Rs 41 In Account : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఝాన్సీరాణి అనే మహిళ ఢిల్లీలోని ఏరోసిటీలో ఉన్న విలాసవంతమైన పుల్‌మాన్ హోటల్‌కు వెళ్లింది. హోటల్ గదిని బుక్ చేసుకొని.. 15 రోజులు అందులోనే లగ్జరీగా గడిపింది. వసతులన్నీ ఎంజాయ్ చేసింది. చివరకు మొత్తం రూ. 5.88 లక్షలు బిల్లు(Rs 41 In Account) అయ్యింది. ఆమె హోటల్‌ను విడిచివెళ్లే టైంలో ఓ యూపీఐ యాప్ ద్వారా డబ్బులు పేమెంట్ చేసినట్టు సిబ్బందికి చూపించింది. అయితే బ్యాంకు అకౌంట్‌లో మాత్రం డబ్బులు పడలేదు. దీంతో హోటల్ నిర్వాహకులు దీనిపై పోలీసులకు సమాచారం అందించారు. ఆమెను పోలీసులు జనవరి 13న అరెస్టు చేసి ప్రశ్నించగా.. ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.
We’re now on WhatsApp. Click to Join
నిందితురాలు ఝాన్సీరాణి ఉపయోగించిన అకౌంట్ నకిలీదని వెల్లడైంది. మొత్తం రూ.5.88 లక్షల బిల్లులో.. రూ.2.11 లక్షలు ఆమె హోటల్‌లోని స్పా సౌకర్యాన్ని వాడుకునేందుకు అయిన ఛార్జీయే కావడం గమనార్హం. హోటల్ రూంను బుక్ చేసుకునేటప్పుడు తనను తాను ఇషా దేవ్ అనే పేరుతో ఝాన్సీరాణి పరిచయం చేసుకుంది. దీనికి సంబంధించిన ఒక నకిలీ ఐడెంటిటీ కార్డును చూపించింది. ఈ కేసులో ఆమెపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారణలో సదరు మహిళ బ్యాంకు ఖాతాలు ఇవ్వడంలో సహకరించలేదు.
Also Read : February 1 – IMPS : ఫిబ్రవరి 1 విడుదల.. ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్ ఇకపై ఇంకా ఈజీ!
ఢిల్లీ పోలీసులు ఝాన్సీరాణి పూర్తి వివరాల కోసం ఏపీ పోలీసులను ఆశ్రయించారు. తాను, తన భర్త డాక్టర్లమని.. అమెరికాలోని న్యూయార్క్‌లో ఉంటామని విచారణలో ఝాన్సీరాణి చెప్పినట్లు పోలీసులు అంటున్నారు. విమానాశ్రయం సమీపంలో మహిళ అన్నిరోజులు ఎందుకు ఉండాల్సి వచ్చిందో విచారణ చేస్తున్నామన్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. ఆమె బ్యాంకు అకౌంట్‌లో రూ.41 రూపాయలు మాత్రమే ఉన్నాయి. అకౌంట్లో డబ్బులు లేకున్నా.. 6 లక్షల బిల్లు చేసే దుస్సాహసానికి ఈ మహిళ తెగబడటం గమనార్హం.
Also Read :Traffic Challans : నేడే లాస్ట్ డేట్.. డిస్కౌంటుతో ట్రాఫిక్ ఛాలాన్లు కట్టేయండి
ఏపీ ప్రభుత్వ లెక్కల ప్రకారం 2023లో నేరాల వివరాలివీ..
- దొంగతనాలు – 37.24 శాతం
- దోపిడీలు – 28.57 శాతం
- సైబర్ నేరాలు – 25.52 శాతం
- SC/ST లపై నేరాలు – 15.20 శాతం
- మహిళలపై వేధింపులు – 14 శాతం
- రాత్రి దొంగతనాలు -13.54 శాతం
- పగటి దొంగతనాలు -13.41 శాతం
- హత్యాయత్నం, గొడవల కేసులు – 10 శాతం
- రోడ్డు ప్రమాదాలు -7.83 శాతం