HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Andhra Pradesh Endowments Minister Vows To Protect Temple Lands At Any Cost

AP Archakas : ఏపీలోని అర్చ‌కుల‌కు శుభ‌వార్త‌

అర్చకుల గౌరవ వేతనం పెంచేందుకు జ‌గ‌న్ స‌ర్కార్ సిద్ధం అవుతోంది. ఆలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు యూనిఫాం డ్రెస్‌ కోడ్ అమ‌లు చేయ‌నుంది.

  • Author : CS Rao Date : 24-08-2022 - 6:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kottu Satyanarayana
Kottu Satyanarayana

అర్చకుల గౌరవ వేతనం పెంచేందుకు జ‌గ‌న్ స‌ర్కార్ సిద్ధం అవుతోంది. ఆలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు యూనిఫాం డ్రెస్‌ కోడ్ అమ‌లు చేయ‌నుంది. దేవాదాయ‌శాఖ ప‌రిధిలోని దేవాల‌యాల్లో దసరా వేడుక‌ల‌ను ప్ర‌త్యేకంగా నిర్వహించడానికి ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. జిల్లా స్థాయి ఎండోమెంట్స్ అధికారులు ఉత్సవాలను పర్యవేక్షించేలా ఏపీ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంది. దేవాదాయ శాఖ ఉద్యోగులకు పదోన్నతుల ప్రకటించ‌డానికి జ‌గ‌న్ స‌ర్కార్ జాబితాను సిద్ధం చేసింది. ఆ మేర‌కు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు స‌త్యానాయ‌ణ అధికారుల స‌మీక్ష‌లో వెల్ల‌డించారు.

దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయ భూములను పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ భ‌రోసా ఇచ్చారు. దేవాదాయశాఖ కమిషనర్‌ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఆలయ భూములపై ​​కోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఎండోమెంట్స్ శాఖ వ్యవహారాలపై ప్రతి మంగళవారం సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. శాఖ పరిధిలోని పలు దేవాలయాల భూములు వివాదాలు, వ్యాజ్యాల్లో ఉన్నాయని మంత్రి గుర్తు చేశారు. సివిల్ కోర్టుల్లో ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా తీర్పులు వెలువడుతున్నాయ‌ని అన్నారు.

ఈ కేసులను అసిస్టెంట్ కమిషనర్ (ఎండోమెంట్స్)కి అప్పగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, వాటి పర్యవేక్షణకు స్టాండింగ్ కమిటీ కూడా ఉందని చెప్పారు. అవసరమైతే అన్యాక్రాంతమైన భూములకు సంబంధించి సుప్రీంకోర్టుకు వెళ్తామని అన్నారు. 2019కి ముందు 1,600 దేవాలయాలకు మాత్రమే వర్తింపజేసిన ధూప దీప నైవేద్యం పథకం (డీడీఎన్‌ఎస్) రాష్ట్రవ్యాప్తంగా 2,000కు పైగా ఆలయాలకు విస్తరింపజేయనున్నట్లు సత్యనారాయణ వెల్ల‌డించారు. రాష్ట్రంలోని ప్రతి ఆలయంలో ధూపదీప నైవేద్యాలు నిర్వహించేలా చూడాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ల‌క్ష్యమని మంత్రి అన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • archakas
  • Endowments minister
  • kottu satyanarayana

Related News

Cbn Speech

Chandrababu : విశాఖ ఫార్మా సిటీ అగ్ని ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం

అనకాపల్లి జిల్లా పరవాడలోని ఫార్మా సిటీలోని దక్షిణ్ ఎనర్జీలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు కార్మికుల మృతిపై సీఎం తన సంతాపం తెలియచేశారు. జిల్లా అధికారులతో మాట్లాడి ప్రమాదం జరిగిన తీరుపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫార్మా సిటీ అగ్నిమాపక కేంద్రం నుంచి రెండు, పరవాడ నుంచి మరొక అగ్న

  • Health Minister

    AP : ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు!

Latest News

  • CI Nagaraju: సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్

  • Telegram: మళ్లీ టెలిగ్రామ్ సేవలు అందుబాటులోకి

  • George Kurian: కేంద్ర మంత్రి పదవికి జార్జ్ కురియ‌న్ రాజీనామా

  • Men Skincare: మగవారికి కూడా మెరిసే చర్మం కావాలంటే ఇలా చేయాల్సిందే!

  • Nitish Kumar Reddy: నితీశ్ కుమార్ రెడ్డికి గాయం.. ఐర్లాండ్ సిరీస్‌కు దూరం.. ఇంగ్లాండ్‌ టూర్‌కూ అనుమానమే.?

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd