Kottu Satyanarayana : దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రెస్ మీట్.. మరిన్ని ఆలయాలు దేవాదాయ శాఖలోకి..
తాజాగా ధర్మ ప్రచారం కార్యక్రమంపై, దేవాదాయ శాఖ భూముల ఆక్రమణలపై దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ(Kottu Satyanarayana) ప్రెస్ మీట్ నిర్వహించారు.
- By News Desk Published Date - 09:14 PM, Tue - 22 August 23

ఎక్కువ ఆదాయం గల మరిన్ని ఆలయాలని దేవాదాయ శాఖలో కలిపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇటీవల దీనిపై విచారించి పలు ఆలయాలను కూడా గుర్తించారు. తాజాగా దీనిపై, ధర్మ ప్రచారం కార్యక్రమంపై, దేవాదాయ శాఖ భూముల ఆక్రమణలపై దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ(Kottu Satyanarayana) ప్రెస్ మీట్ నిర్వహించారు.
కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. 5 లక్షల ఆదాయం కలిగిన 23,600 ఆలయాలు గుర్తించాం. వాటిని దేవాదాయ శాఖలోకి ఆహ్వానించాం. ఆలయ నిర్వహణ అప్పగించేందుకు కేవలం 37 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. వాటికి ధూప దీప నైవేద్య కార్యక్రమం నిర్వహించే అంశంపై యధావిధిగా కార్యాచరణ జరుగుతుంది. ధర్మ ప్రచారం కార్యక్రమం ఏడాది పొడవునా చేపట్టేలా చర్యలు చేస్తున్నాం. దేవాలయాల వారీగా సమీప ప్రాంతాల్లో ధర్మ ప్రచారం కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో స్థానిక కళాకారులకు కూడా చేయూత లభిస్తుంది అని తెలిపారు.
అలాగే.. ప్రభుత్వం ఈ ధర్మ ప్రచారం కార్యక్రమం చేపడితే కొందరు నాపై వ్యక్తిగతంగా దుష్ప్రచారం చేస్తున్నారు. పట్టణాల్లో దేవాదాయ శాఖ సత్రాలు, మఠాలు ఆక్రమణల చేయడాన్ని నిలువరిస్తాం. దేవాదాయ శాఖకు చెందిన ఏ భూమి అయినా చట్టపరంగా స్వాధీనం చేసుకునేలా ఆర్డినెన్సు ఇచ్చాం. అన్యాక్రాంతం అయ్యేందుకు వీలు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. 4.60 లక్షల ఎకరాల భూమి దేవాదాయ శాఖదే. 1.65 లక్షల గజాల వాణిజ్య స్థలం ఆక్రమణలో ఉందిఅని తెలిపారు.
Also Read : AP : హిందూ సంప్రదాయంపై అవగాహనలేని వ్యక్తిని టీటీడీ ఛైర్మన్ గా ఎలా చేస్తారు..? – బండి సంజయ్