Amaravathi : జడ్జిలకు `అమరావతి` ఓ ఛాలెంజ్
న్యాయమూర్తులకే అమరావతి సవాల్ గా మారింది. సీఆర్డీఏ రద్దు పై ఏపీ హైకోర్టులో్ జరిగిన వాదనల్లో న్యాయమూర్తుల నైతికతపై ఆసక్తికర వాదన జరగడం విచిత్రం.
- By CS Rao Published Date - 03:25 PM, Tue - 16 November 21

న్యాయమూర్తులకే అమరావతి సవాల్ గా మారింది. సీఆర్డీఏ రద్దు పై ఏపీ హైకోర్టులో్ జరిగిన వాదనల్లో న్యాయమూర్తుల నైతికతపై ఆసక్తికర వాదన జరగడం విచిత్రం. ప్రభుత్వం తరపు న్యాయవాద దవే కేసు ఆద్యంతమూ న్యాయమూర్తుల ప్రమేయంపై వాదించారు. సీఆర్డీయే పరిధిలో న్యాయమూర్తులు భూములు కొనుగోలు చేశారని, అలాంటి వాళ్లు ఈ కేసు వాదనల నుంచి తప్పుకోవాలని కోరాడు. ఆ మేరకు సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను ఉటంకించాడు.
ముగ్గురు సభ్యులు గల త్రిసభ్య బెంచ్ అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డయే బిల్లు రద్దుపై వాదనలను వినడానికి సిద్ధం అయింది. రద్దు చట్టాలను సవాల్ చేస్తూ రైతులు వేసిన పిటిషన్లపై వాదనలు జరిగాయి. త్రిసభ్య బెంచ్ లోని జస్టిస్ డివిఎస్‌ఎస్ సోమయాజులు, జస్టిస్ సత్యనారాయణ మూర్తి ఇద్దరూ సీఆర్డీయే పరిధిలో భూములను కొనుగోలు చేశారని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించాడు. పెట్టుబడి రూపంలో ఆర్థిక పరమైన లబ్ధి కోసం ఇద్దరూ చూస్తున్నారని ఆరోపిస్తూ వేసిన పిటిషన్ ను ప్రధాన న్యాయమూర్తి తిరస్కరించాడు.
Also Read : మర్రికి మొండి చెయ్యి చూపిన జగన్..పేట వైసీపీలో ముసలం
చంద్రబాబు ప్రభుత్వం ఆనాడు న్యాయమూర్తులకు రాజధాని ప్రాంతంలో భూములు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. న్యాయమూర్తులకు ప్రత్యేకంగా చదరపు గజానికి రూ.5,000 చొప్పున 600 చదరపు గజాలను కేటాయించింది. ఆ విషయాన్ని ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి అఫిడవిట్ లో తెలిపింది. డివిజన్ బెంచ్‌లో ఉన్న జస్టిస్ సత్యనారాయణ మూర్తి, జస్టిస్ సోమయాజులు లకు ఆనాటి ప్రభుత్వం ప్లాట్లను ఇచ్చింది.
ఇలాంటి పరిస్థితిల్లో అమరావతి సమస్యకు సంబంధించిన పిటిషన్‌లను వారు విచారించడం సరికాదని శ్రీలక్ష్మి ఎత్తిచూపారు.ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే మాట్లాడుతూ, ప్లాట్లలో పెట్టుబడికి సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలు ఇమిడి ఉన్నందున, ఇద్దరు న్యాయమూర్తులు విచారణ నుండి తప్పుకోవాలని అన్నారు. కేసు తీర్పులో న్యాయమూర్తుల భాగస్వామ్యం “న్యాయం జరగడమే కాకుండా జరిగేలా చూడాలనే సూత్రానికి విరుద్ధంగా ఉంది” అని ఆయన ఎత్తిచూపారు.
దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణ సాధ్యం కాదని, ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్నందున తాను కూడా తప్పుకోవాలా అని ప్రశ్నించారు. ఈ పిటిషన్లను డివిజన్ బెంచ్ విచారిస్తుందని నొక్కిచెప్పిన ప్రధాన న్యాయమూర్తి, ప్రభుత్వ విజ్ఞప్తిని సమర్థిస్తే, ప్రతి ఒక్కరూ ఏదో ఒక సాకుతో న్యాయమూర్తుల ఉపసంహరణ కోరడానికి వస్తారని అభిప్రాయపడ్డారు.ఈ సమయంలో దుష్యంత్ దవే సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకునేందుకు వీలుగా ఆ మేరకు లిఖిత పూర్వక ఉత్తర్వులు జారీ చేయాలని ప్రధాన న్యాయమూర్తిని కోరారు. కానీ, ఈ తరుణంలో అలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేయడం అమరావతి రైతులకు కొంత ఊరట. రోజు వారీ విచారణతో తుది తీర్పు వెంటనే ఇవ్వాలని భావిస్తున్నట్టు చీఫ్ జస్టిస్ చెప్పడం గమనార్హం.
ఒక కేసులో తమ స్వంత ప్రయోజనాలు ఉన్నట్లయితే, కేసును విచారిస్తున్న న్యాయమూర్తులు స్వచ్ఛందంగా తమను తాము వదులుకోవాలని దావ్ ఉటంకించాడు. ఆ మేరకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను తెలియచేశాడు. ఈ కేసులో ప్రధాన పిటిషనర్లు అధిక మార్కెట్ విలువ కలిగిన రాజధాని ప్రాంతంలో తిరిగి ప్లాట్లు పొందాలనే ఆశతో భూములను అప్పగించారనేది ప్రభుత్వ వాదనలోని సారాంశం.
సో..ఇప్పుడు డివిజన్ బెంచ్ లోని ఇద్దరు న్యాయమూర్తులు అమరావతికి అనుకూలంగా తీర్పు చెబితే ఖచ్చితంగా అనుమానాలను రేకిత్తించే అవకాశం ఉంటుంది. అందుకే, ఈ అమరావతి కేసు న్యాయమూర్తులకే సవాల్ గా మారిందని చెప్పవచ్చు.
Related News

Nara Bhuvaneswari : అమరావతి నిర్మాణం జరిగి తీరుతుంది.. రాజధాని రైతులతో నారా భువనేశ్వరి
ఏపీకి రాజధాని ఏర్పాటు చేయడం కోసం అమరావతి రైతులు చేసిన త్యాగాలు వృథా కావని.. అమరావతి నిర్మాణం జరిగి