CM Chandrababu : ముఖ్యమంత్రి చంద్రబాబు పై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
ఇక్కడి కాఫీ ప్యాకేజింగ్‌ని గిరిజనుల వేషధారణ, భారతదేశంలోని వైవిధ్యమైన రంగుల స్ఫూర్తితో రూపొందించినట్లు వివరించారు. పారిస్ కేఫ్‌ల్లోని ఎలక్ట్రానిక్ స్క్రీన్లపై అరకులోని గిరిజనుల జీవనశైలికి సంబంధించిన చిత్రాలు, వీడియోలు ప్రదర్శించనున్నట్లు తెలిపారు.
- By Latha Suma Published Date - 01:19 PM, Mon - 31 March 25

CM Chandrababu: ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. సీఎం చంద్రబాబు ఆలోచనలు అద్భుతంగా ఉంటాయని ఆనంద్ మహీంద్రా అన్నారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. అరకు కేఫ్‌లు విస్తరిస్తున్న తీరును చూసి ఆయన సంతోషిస్తారని పేర్కొన్నారు. ఇక్కడి కాఫీ ప్యాకేజింగ్‌ని గిరిజనుల వేషధారణ, భారతదేశంలోని వైవిధ్యమైన రంగుల స్ఫూర్తితో రూపొందించినట్లు వివరించారు. పారిస్ కేఫ్‌ల్లోని ఎలక్ట్రానిక్ స్క్రీన్లపై అరకులోని గిరిజనుల జీవనశైలికి సంబంధించిన చిత్రాలు, వీడియోలు ప్రదర్శించనున్నట్లు తెలిపారు.
Read Also: Jay Shah – Lokesh : ‘లోకేష్ – జైషా’ ఆ లెక్కే వేరప్పా
Thank you @ncbn for your unwavering support & encouragement ever since you proposed the creation of @naandi_india
Your ideas are spot on.
And you will be pleased to hear that every Araku cafe has the map of the coffee growing region—terroir-wise—depicted. @manoj_naandi has… https://t.co/nF81MWCehg— anand mahindra (@anandmahindra) March 30, 2025
కాగా, ఆనంద్ మహీంద్రా ఈ నెల 29న కూడా కూడా ‘ఎక్స్’లో ఆసక్తికర పోస్టు పెట్టారు. పారిస్‌లో మా రెండో అరకు కాఫీ స్టాల్ అంటూ వీడియో పెట్టారు. దీనిపై సీఎం చంద్రబాబు స్పందించారు. పచ్చని అరకులోయ నుంచి పారిస్ నడిబొడ్డుకు మేడ్ ఇన్ ఏపీ ఉత్పత్తి చేరడం, ప్రపంచవ్యాప్తంగా తగిన గుర్తింపు లభించడం స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఇక, ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు నాయకత్వానికి మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఉన్న గౌరవాన్ని ప్రతిబింబిస్తున్నాయి. రాష్ట్రంలో ఐటీ రంగంలో సాధించిన విజయాలు, యువతకు అందిన అవకాశాలు ఈ ప్రశంసలకు కారణంగా నిలిచాయి.
Read Also: Earthquake : మయన్మార్ లో 10 వేల మంది మృతి?