Anam : జగన్ పేదవాడు ఎందుకు అవుతాడని ప్రశ్నించిన ఆనం వెంకటరమణారెడ్డి
భారతీ సిమెంట్స్ లో జగన్ కు 2 కోట్ల 38.లక్షల 60 వేల 435 షేర్లు ఉన్నాయని, వీటి విలువ రూ.2,500 కోట్లు పైనే ఉంటుందని అలాంటప్పుడు జగన్ పేదవాడు ఎందుకు అవుతాడు అని ప్రశ్నించారు
- By Sudheer Published Date - 04:22 PM, Sun - 5 November 23

టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి (Anam Venkata Ramana Reddy) మరోసారి సీఎం జగన్ (Jagan) ఫై నిప్పులు చెరిగారు. భారతీ సిమెంట్స్ లో జగన్ కు 2 కోట్ల 38.లక్షల 60 వేల 435 షేర్లు ఉన్నాయని, వీటి విలువ రూ.2,500 కోట్లు పైనే ఉంటుందని అలాంటప్పుడు జగన్ పేదవాడు ఎందుకు అవుతాడు అని ప్రశ్నించారు. ఇప్పుడు పేదలెవరో, పెత్తందార్లు ఎవరో జగనే చెప్పాలి ఆనం డిమాండ్ చేశారు. జగన్ – భారతి లకు కలిపి రూ.4వేల కోట్లకి పైగా షేర్లు ఉన్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
భారతీ సిమెంట్స్ (Bharathi Cement) లాభాల్లో ఉంది.. ఒక త్రైమాసికంలో రూ.235 కోట్లు ఆదాయం చూపారు.. 2001 నుంచి 2024 వరకూ భారతి సిమెంట్స్ టర్నోవర్ రూ.2వేల కోట్లుకు ఎలా పెరిగింది అని ఆనం వెంకట రమణారెడ్డి ప్రశ్నించారు. వైఎస్ భారతికి ప్రతి నెల జీతం రూపంలో రూ.32.50 లక్షలు వస్తుందని వెల్లడించారు. వైఎస్ భారతికి ఈ మొత్తం ప్రతి నెలా 1వ తేదీన చెక్కు రూపంలో వస్తుందని అన్నారు.
1999లో ఫ్రెంచ్ కంపెనీ భారతి సిమెంట్స్ లో షేర్లు కొనుగోలు చేసిందని వెల్లడించారు. ఫ్రెంచ్ కంపెనీ రూ.671 చొప్పున షేర్లు కొనుగోలు చేసిందని పేర్కొన్నారు. భారతి సిమెంట్స్ లో వాటా కొనుగోలు చేసిన ఫ్రెంచ్ కంపెనీకి 51 శాతం వాటా ఉందని వివరించారు. కానీ, 49 శాతం వాటా ఉన్న వైఎస్ భారతికి ఎక్కువ జీతం ఉందని తెలిపారు. ఫ్రెంచ్ కంపెనీ డైరెక్టర్ కు మాత్రం తక్కువ జీతం ఉందని అన్నారు. ఇక, వైఎస్ఆర్ ఉన్నపుడు 30 లక్షల హౌసింగ్ ఇళ్లకు భారతీ సిమెంటు వాడారా? లేదా? చెప్పాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి డిమాండ్ చేశారు.
Read Also : Kishan Reddy : కేసీఆర్ కు రెండు చోట్ల ఓటమి ఖాయం – కిషన్ రెడ్డి