Kishan Reddy : కేసీఆర్ కు రెండు చోట్ల ఓటమి ఖాయం – కిషన్ రెడ్డి
అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డిల్లో పోటీ చేస్తున్నారని, ఆయన రెండు చోట్లా ఓడిపోతారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు
- By Sudheer Published Date - 04:14 PM, Sun - 5 November 23

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Elections) సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార పార్టీ (BRS) తో పాటు ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విమర్శలు , ప్రతి విమర్శలు చేసుకుంటూ ప్రజల్లో మరింత ఆసక్తి రేపుతున్నారు. ఈరోజు ఆదివారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమం నిర్వహించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy). ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ (KCR) ఫై నిప్పులు చెరిగారు.
We’re now on WhatsApp. Click to Join.
అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డిల్లో పోటీ చేస్తున్నారని, ఆయన రెండు చోట్లా ఓడిపోతారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల్లో ఎంతటి ఆగ్రహజ్వాలలు రగులుతున్నాయో నవంబర్ 30 న జరగబోయే ఎన్నికల్లో తెలుస్తుందని అన్నారు. తెలంగాణ యువత సునామీలా విజృంభించి బీఆర్ఎస్ పార్టీని తుడిచిపెట్టేస్తుందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితమే తెలంగాణ అంతటా పునరావృతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా, తెలంగాణ ఎన్నికల్లో తాము జనసేనతో కలిసి పోటీ చేస్తున్నామని, జనసేన 09 స్థానాల్లో పోటీ చేయబోతోందని , ఈ నెల 07 హైదరాబాద్ లో జరగబోయే బీసీ ఆత్మగౌరవ సభ కు ప్రధాని మోడీ రాబోతున్నారని , అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఈ సభకు హాజరుక్కనున్నట్లు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
Read Also : Relationship : అతన్ని వదిలి వెళ్లమని చెప్పే 8 సంకేతాలు ఇవే..!