Ambati Rayudu: పవన్‌తో భేటీపై అంబటి రాయుడు కీలక వ్యాఖ్యలు
పవన్‌తో భేటీపై అంబటి రాయుడు కీలక వ్యాఖ్యలు చేశాడు. పవన్ కల్యాణ్ పిలిస్తే మాత్రమే వెళ్లాను అంటూ అంబటి రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పవన్ ఆలోచనలు, నా ఆలోచనలు ఒకేలా ఉన్నాయని
- By Praveen Aluthuru Published Date - 08:32 PM, Wed - 10 January 24

Ambati Rayudu: పవన్‌తో భేటీపై అంబటి రాయుడు కీలక వ్యాఖ్యలు చేశాడు. పవన్ కల్యాణ్ పిలిస్తే మాత్రమే వెళ్లాను అంటూ అంబటి రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పవన్ ఆలోచనలు, నా ఆలోచనలు ఒకేలా ఉన్నాయని చెప్పాడు. ప్రజలకు సేవ చేయాలన్న నా కల వైసీపీతో నెరవేరేలా లేదని, ప్రస్తుతం క్రికెట్ ఆడేందుకు దుబాయ్ వెళ్తున్నట్టు రాయుడు తెలిపాడు. కాగా పవన్ కళ్యాణ్ – రాయుడు భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పిన అంబటి రాయుడు ఈ రోజు బుధవారం మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యాడు. అయితే అంబటి రాయుడు పవన్ కల్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిశారా లేక జనసేనలో చేరుతున్నారా అన్న అనుమానాలు లేవనెత్తాయి. అయిత్ ఈ భేటీ ఎలాంటి రాజకీయాలను ఉద్దేశించి కాదని రాయుడు చెప్పడం ఆసక్తి దాయకం. రాజకీయంగా చూస్తే.. అంబటి రాయుడు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన జనసేనలో చేరితో పార్టీకి మరింత లాభం చేరుకుందని భావించారు. అంతకుముందు వైసీపీ కండువా కప్పుకున్న రాయుడు వైసీపీ తరుపున గుంటూరు ఎంపీ టికెట్ ఆశించారని సమాచారం. అయితే సీటు హామీ దక్కికపోవడంతో రాయుడు అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీకి గుడ్ బై చెప్పినట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
గత ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడిన అంబటి రాయుడు సీజన్ ముగియగానే ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత ఏపీ రాజకీయాల్లో యాక్టీవ్ అయ్యారు. వైసీపీకి మద్దతుగా అనేక కామెంట్స్ చేశాడు. గుంటూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో కూడా పర్యటించారు. ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి అంబటి రాయుడు మద్దతుగా వ్యవహరించారు.ఇంతలోనే రాజీనామా అంటూ బాంబ్ పేల్చాడు.
ఇదిలా ఉండగా.. ఇదే రోజు ఆంధ్ర రాజకీయాల్లో మరో ఆసక్తికర విషయం చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పిన విజయవాడ ఎంపీ కేశినేని నాని ఈరోజు మధ్యాహ్నం సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. వైసీపీలో చేరుతున్నట్టు ఆయన ప్రకటించాడు. ఏఈ క్రమంలో చంద్రబాబుపై హాట్ కామెంట్స్ చేశాడు.
Also Read: Power Policy Soon: తెలంగాణలో సమగ్ర విద్యుత్ విధానం: సీఎం రేవంత్