Ambati Rayudu: సీఎం జగన్ ని కలిసిన సీఎస్‌కే మేనేజ్‌మెంట్
2023 ఐపీఎల్ ట్రోఫీ చెన్నై సూపర్ కింగ్స్ కైవసం చేసుకుంది. ధోనీ సారధ్యంలో చెన్నై ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకుంది.
- Author : Praveen Aluthuru
Date : 08-06-2023 - 6:46 IST
Published By : Hashtagu Telugu Desk
Ambati Rayudu: 2023 ఐపీఎల్ ట్రోఫీ చెన్నై సూపర్ కింగ్స్ కైవసం చేసుకుంది. ధోనీ సారధ్యంలో చెన్నై ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకుంది. ఇదిలా ఉండగా తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిశారు. ఈ భేటీలో గుంటూరు నివాసి, చెన్నై ఆటగాడు అంబటి రాయుడు కూడా ఉండటం గమనార్హం. అందులో భాగంగా ఐపీఎల్ కప్ ను సీఎంకు చూపించారు సీఎస్‌కే ఫ్రాంచైజీ ఓనర్ ఎన్.శ్రీనివాసన్ కుమార్తె రూపా గురునాథ్, అంబటి రాయుడు. ఈ సందర్భంగా సీఎస్‌కే టీం సభ్యుల ఆటోగ్రాఫ్‌తో కూడిన జెర్సీని ముఖ్యమంత్రికి బహుకరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెన్నై టీమ్ ను అభినందించారు.

ఏపీలో క్రీడారంగం అభివృద్ది, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా క్రీడలను ప్రోత్సహించడానికి తాను ఆసక్తిగా ఉన్నట్లు అంబటి రాయుడు ముఖ్యమంత్రికి వివరించాడు. ఇందుకు సీఎం కూడా సానుకూలంగా స్పందించారు. తమ సూచనల మేరకు పటిష్టమైన కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందిస్తుందని సీఎం హామీ ఇచ్చారు.
Read More: Botsa Satyanarayana : ఏపీ నూతన విద్యాసంవత్సరంపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ..