Ambati Rambabu : చంద్రబాబు ఓ మోసగాడు, ఓ 420 – అంబటి
- Author : Sudheer
Date : 04-03-2024 - 11:39 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు ఎక్కవుతుంది. ప్రచార సభల్లోనే కాదు సోషల్ మీడియా లోను సైతం ఇరు నేతలు విమర్శలు , ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నారు. తాజాగా పల్నాడు లో రా కదలిరా సభలో చంద్రబాబు (Chnadrababu) చేసిన కామెంట్స్ ఫై వైసీపీ మంత్రి అంబటి (Ambati Rambabu) రియాక్ట్ అయ్యాడు.
చంద్రబాబు 14 ఏళ్లు పరిపాలనలో పల్నాడుకు ఏం చేశాడో చెప్పే ప్రయత్నం మాత్రం చేయలేదన్నారు. చంద్రబాబు ఓ మోసగాడు, ఓ 420 అని ధ్వజమెత్తారు. కోడెల ఆత్మహత్యకు కారణం చంద్రబాబే అంటూ అంబటి ఆరోపించారు . కోడెల కుటుంబాన్ని చంద్రబాబు వేధించారు. చంద్రబాబు కుట్రలకు కోడెల భయపడ్డారు. కోడెల చనిపోయినా ఆ కుటుంబంపై చంద్రబాబుకు కక్ష పోలేదన్నారు.కోడెల కుటుంబానికి టికెట్ ఎందుకు ఇవ్వలేదని మంత్రి ప్రశ్నించారు.
We’re now on WhatsApp. Click to Join.
చంద్రబాబు మాట్లాడేటప్పుడు నాలుక జాగ్రత్త పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. తనను ఆంబోతు అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘నన్ను ఆంబోతు అంటున్నావ్.. నీ చరిత్ర ఏంటో తెలుసుకో చంద్రబాబు. ఆంబోతులకు ఆవులను సప్లయి చేసిన చరిత్ర నీది’ అంటూ పేర్కొన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మారీచుడు అని.. మార్చమని చంద్రబాబు అంటున్నారని.. మార్చేది లేదు..నీకు దమ్ముంటే పిన్నెల్లిని ఓడించని సవాల్ విసిరారు . అతన్ని చూస్తేనే భయపడుతున్నావని అన్నారు. కాసు మహేష్ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదని.. వారి కుటుంబం ఈ రాష్ట్రంలో అనేకమైన పదవులు నిర్వహించారన్నారు. మీ పరిపాలనలో ఈ 7 నియోజకవర్గాల్లో ఓడిపోయిన మీ వాళ్ల గురించి చెప్పడం లేదెందుకని ఎదురు ప్రశ్నించారు . చంద్రబాబు ఎంత దుర్మార్గమైన పరిపాలన చేశారో గుర్తు చేసుకోండి. అందుకే ఆ 7 నియోజకవర్గాల్లో మీ టీడీపీ అభ్యర్థులను ప్రజలు ఓడించి చరిత్ర సృష్టించారన్నారు.
Read Also : Bribe For Vote : లంచం కేసుల్లో ఎంపీ, ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదు : సుప్రీం