Chandrababu Naidu: అమరావతికి 3 ఏళ్లలో రూపం – చంద్రబాబు స్పష్టమైన రోడ్‌మ్యాప్
తన ప్రభుత్వం ఏడాది కాలంలో ఊహించిన దానికంటే ఎక్కువ సాధించిందని అన్నారు
- By Hashtag U Published Date - 10:43 PM, Mon - 23 June 25

అమరావతి: (Chandrababu Naidu) మూడు సంవత్సరాలలో అమరావతికి స్పష్టమైన రూపం తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. పరిపాలనలో మొదటి అడుగు వేస్తూ, జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలముందు సమగ్రంగా వివరించారు. రాష్ట్రానికి ఉన్న ప్రస్తుత అవసరాలను గుర్తించి, భవిష్యత్తులో చేసే పనులకు స్పష్టమైన దిశను చూపించారు.
తన ప్రభుత్వం ఏడాది కాలంలో ఊహించిన దానికంటే ఎక్కువ సాధించిందని అన్నారు. డబుల్ ఇంజిన్ పాలన ఫలితంగా అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందో నిరూపించామని చెప్పారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ లేదా డిసెంబరులోగా పూర్తిచేస్తామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో బనకచర్ల నీటి ప్రాజెక్టు కీలకంగా మారుతుందని చెప్పారు.
Also Read: Suparipalanalo Toli Adugu : గెలిచింది కూటమి కాదు ప్రజలు – నారా లోకేష్
గోదావరి నీటిని రెండు రాష్ట్రాలు చెరో 200 టీఎంసీలు వినియోగించుకుంటే, రెండు రాష్ట్రాలకు మేలు జరుగుతుందని సూచించారు. మహిళలపై జరిగే వేధింపులు, లైంగిక దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ తాము సహించబోమని స్పష్టం చేశారు. డ్రగ్స్ ముఠాలు, నేరాల పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రాజకీయ ముసుగులో నేరాలు చేయాలనుకునే వారు తన పాలనలోకి దూరే అవకాశం లేదని స్పష్టంగా ప్రకటించారు సీఎం చంద్రబాబు.