HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Amaravati As Capital Of Ap Visakhapatnam As Financial Capital Chandrababu

Amaravati Vs Vizag : ఏపీ రాజధానిగా అమరావతి.. ఆర్థిక రాజధానిగా విశాఖ : చంద్రబాబు

ఏపీ రాజధాని అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు.

  • Author : Pasha Date : 11-06-2024 - 1:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Amaravati Vs Vizag
Amaravati Vs Vizag

Amaravati Vs Vizag : ఏపీ రాజధాని అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. అమరావతిని రాష్ట్ర రాజధానిగా చేస్తామని ఆయన వెల్లడించారు. విశాఖను ఆర్ధిక రాజధానిగా అభివృద్ధి చేద్దామన్నారు. విశాఖ న్యాయ రాజధాని అంటూ  జగన్ చేసిన మోసాన్ని ప్రజలు గ్రహించారని చంద్రబాబు చెప్పారు. కర్నూలు అభివృద్ధికి  కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ఇవాళ ఉదయం ఎన్డీయే శాసన సభాపక్ష నేతగా తనను ఎన్నుకున్నందుకు కూటమి ఎమ్మెల్యేలకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘సీఎం కూడా మామూలు మనిషే..  సీఎం వస్తున్నాడు అంటే ఇక పరదాలు కట్టటం, దుకాణాలు బంద్ చేయటం, ట్రాఫిక్ నిలిపి వేయటం, చెట్లు నరకటం లాంటివి ఇకపై ఉండకూడదు. నా కాన్వాయ్ ఒక నిమిషం ఆలస్యమైనా పర్లేదు. ట్రాఫిక్ నిబంధనల పేరుతో ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు’’ అని చంద్రబాబు (Amaravati Vs Vizag) స్పష్టం చేశారు.

We’re now on WhatsApp. Click to Join

‘‘తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోం. తప్పు చేసిన వారిని వదిలిపెడితే అదొక అలవాటుగా మారిపోతుంది. అందుకే చట్టపరంగా వారిని కచ్చితంగా శిక్షించాల్సిన అవసరం ఉంది’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. విధ్వంస, కక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని టీడీపీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. పదవి వచ్చిందని విర్రవీగొద్దని వినయంగా మాత్రమే ఉండాలని ఈ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించారు. ‘‘ముఖ్యమంత్రిగా మళ్లీ గౌరవ సభలో అడుగుపెడతాననే నా శపథాన్ని రాష్ట్ర ప్రజలు గౌరవించారు. ప్రజల గౌరవాన్ని నిలబెడుతూ మళ్లీ గౌరవ సభ నిర్వహిద్దాం’’ అని పేర్కొన్నారు.

తెలంగాణలోని 7 మండలాల విలీనంపై కీలక వ్యాఖ్యలు

2014లో కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన 7 మండలాలను ఏపీలో విలీనం చేయడంపై చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. ‘‘ఏపీకి పోలవరం ముఖ్యమైన ప్రాజెక్టు. దీనికి గతంలో కేంద్ర సర్కారు పూర్తిగా సహకరించింది. 2014లో నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా నేను చేసిన ప్రయత్నాల వల్లే ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండలాలను కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయించింది.  ఆ ఏడు మండలాలను ఏపీలో విలీనం చేయకపోతే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనని అప్పట్లో మోడీకి తేల్చి చెప్పాను. దీంతో ఆయన ఆర్డినెన్స్ జారీ చేసి తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలిపారు. ఆ మండలాలను ఏపీకి ఇవ్వకపోయి ఉంటే పోలవరం ప్రారంభమయ్యేదే కాదు’’ అని చంద్రబాబు తెలిపారు.

Also Read : Elon Musk : ఐఫోన్లలో ఛాట్ జీపీటీ.. భారతీయ మీమ్‌తో ‘మస్క్’ కౌంటర్

తెదేపా-జనసేన-బీజేపీ కూటమి శాసనసభా పక్ష భేటీ ఇవాళ ఉదయం విజయవాడలో జరిగింది. ఈసందర్భంగా ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో కలిసి తెదేపా అధినేత చంద్రబాబు వేదికపై కూర్చున్నారు. వేదికపై చంద్రబాబు కోసం ప్రత్యేక కుర్చీని సిద్ధం చేయగా ఆయన తిరస్కరించారు. కూటమి నేతలందరికీ ఒకే తరహా కుర్చీ ఉండాలని మరో కుర్చీని తెప్పించి దానిపై కూర్చున్నారు.

Also Read : T20 World Cup: టీ20 ప్రపంచకప్ నుండి ఇంటిముఖం పట్టే జట్లు ఇవేనా..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amaravati
  • Amaravati Vs Vizag
  • ap capital
  • chandrababu
  • Financial Capital
  • Visakhapatnam

Related News

Chandrababu Once Again Show

CBN Birthday : మరోసారి గొప్ప మనసు చాటుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 269 అన్న క్యాంటీన్లలో నేడు రోజంతా ఉచితంగా భోజనం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. పేదవాడి ఆకలి తీర్చడమే లక్ష్యంగా గతంలో ప్రారంభించిన ఈ అన్న క్యాంటీన్లు, నేడు పండుగ వాతావరణంలో వేలాది మందికి ఉచితంగా ఆకలి తీరుస్తున్నాయి

  • I entered politics with the aim of serving the public: CM Chandrababu

    Chandrababu Campaign : తమిళనాడులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం

  • Radisson Blu 5-star property set to enter the City of Bulls Ongole

    Andhra Pradesh: ఏపీలో రూ.82.49 కోట్లతో ఫైవ్ స్టార్ హోటల్

  • Nara Lokesh

    Nara Lokesh : తెలుగుదేశం ‘యువ’ గర్జన.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్‌ పట్టాభిషేకం!

  • Perninani Rappa Rappa

    Amaravati : అమరావతి మునిగిపోవాలని కోరుకుంటున్న పేర్ని నాని..! ఇదేనా ప్రజానాయకుడి తీరు ?

Latest News

  • IPL 2026 – SRH Vs DC : ఢిల్లీ పై 47 రన్స్ తేడాతో SRH విజయం

  • TGSRTC Strike: అర్ధరాత్రి నుండి తెలంగాణలో బస్సులు బంద్

  • IPL 2026 – SRH Vs DC : అభిషేక్ మెరుపులు..DC కి 243 టార్గెట్

  • Good News : ఏపీకి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసిన కేంద్రం

  • Telangana Govt : ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

Trending News

    • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

    • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

    • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd