AP Poll : అల్లు అర్జున్..మనస్ఫూర్తిగా పవన్ కు మద్దతు తెలుపలేదా..?
పవన్ కళ్యాణ్ కు అల్లు అర్జున్ మనస్ఫూర్తిగా మద్దతు తెలపలేదని అంటున్నారు. ఒక బడా వ్యక్తి కాల్ చేసి అల్లు ఫ్యామిలీకి వార్నింగ్ ఇవ్వడంతోనే అల్లు అర్జున్ కూడా ఒక మెట్టు దిగి వచ్చి పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేశాడు అని.. ప్రచారం జరుగుతుంది
- Author : Sudheer
Date : 11-05-2024 - 1:57 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీలో ఎన్నికల ప్రచారానికి మరికొద్ది గంటల్లో తెరపడనుంది. ఈరోజు సాయంత్రం 6 తర్వాత అన్ని మైకులు, డీజేలు , అభ్యర్థుల ప్రచారాలు అన్ని సైలెంట్ కానున్నాయి. ఈ క్రమంలో ఉన్న ఈ కొద్దీ సమయాన్ని గట్టిగా వాడుకోవాలని అందరు చూస్తున్నారు. ఈసారి అందరి చూపు పిఠాపురం పైనే ఉంది. ఎవర్ని కదిలించిన పవన్ కళ్యాణ్ గురించే మాట్లాడుకుంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈసారి పవన్ కళ్యాణ్ గెలవాలని కూటమి వారే కాదు వైసీపీ శ్రేణులు కూడా భావిస్తున్నారు. రాజకీయాలకు దూరంగా ఉండే చిత్రసీమ కూడా ఈసారి మేమున్నాం అంటూ పవన్ కు మద్దతు పలికారు. చిన్న ఆర్టిస్ట్ దగ్గరి నుండి అగ్ర నిర్మాతల వరకు ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ కు కూటమి కి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. అయితే ఆలస్యంగానైనా అల్లు అర్జున్..పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలుపడం ఫై పార్టీ శ్రేణులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. కానీ ఇంతలోనే ఆయన వైసీపీ తరుపు అభ్యర్ధికి మద్దతు తెలపడమే కాదు స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి సపోర్ట్ చేయడం ఫై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదే క్రమంలో ఓ వార్త బయటకు వచ్చి వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ కు అల్లు అర్జున్ మనస్ఫూర్తిగా మద్దతు తెలపలేదని అంటున్నారు. ఒక బడా వ్యక్తి కాల్ చేసి అల్లు ఫ్యామిలీకి వార్నింగ్ ఇవ్వడంతోనే అల్లు అర్జున్ కూడా ఒక మెట్టు దిగి వచ్చి పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేశాడు అని.. ప్రచారం జరుగుతుంది . అందుకే ఆ వ్యక్తి ఇబ్బంది ని తట్టుకోలేక ఓ ట్వీట్ చేసాడు తప్ప పవన్ కళ్యాణ్ కోసం మాత్రం చేయలేదని అంటున్నారు. ఈ వార్తలో ఎంత నిజం ఉంది అనేది తెలియదు కానీ సోషల్ మీడియాలో ఏపీ రాజకీయాలలో ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.
Read Also : Upcoming Hero Bikes: హీరో నుంచి రెండు కొత్త బైక్‌లు.. ఎప్పుడు లాంచ్ అవుతాయంటే..?