HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Alliance Leaders Are Doing Time Pass Politics Roja

RK Roja : కూటమి నాయకులు టైం పాస్ పాలిటిక్స్ చేస్తున్నారు – రోజా

RK Roja : రాష్ట్రంలో మహిళలపై, చిన్నారులపై అత్యాచారాలు జరుగుతుంటే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత ఎందుకు స్పందించడం లేదని రోజా ప్రశ్నించారు

  • Author : Sudheer Date : 02-11-2024 - 7:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Roja Tirupathi
Roja Tirupathi

కూటమి నాయకులు (NDA Leaders) టైం పాస్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు వైసీపీ మాజీ మంత్రి రోజా (Roja). ఏపీలో మహిళలపై , చిన్నారుల పై జరుగుతున్న దాడులపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. తాజాగా తిరుపతిలో దారుణం జరిగిన సంగతి తెలిసిందే. మూడేళ్ళ చిన్నారి పై అత్యాచారం ఆపై హత్య చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. గత ప్రభుత్వలోనే అనుకుంటే..ఈ ప్రభుత్వంలో కూడా మహిళలకు , చిన్న పిల్లలకు రక్షణ అనేది లేకుండా పోతుందని తల్లిదండ్రులు వాపోతుండగా..ప్రతి రోజు ఈ తరహా ఘటనలు ప్రభుత్వాన్ని మరింత విమర్శల పాలుచేస్తుంది.

ఇప్పుడు తిరుపతి లో జరిగిన ఘటనపై వైసీపీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ ఘటనపై మాజీ మంత్రి రోజా స్పందించారు. కూటమి ప్రభుత్వం నాయకులు టైం పాస్ పాలిటిక్స్ చేస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో మహిళలపై, చిన్నారులపై అత్యాచారాలు జరుగుతుంటే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత ఎందుకు స్పందించడం లేదని రోజా ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాడ్డాక 100 మందికి పైగా ఆడపిల్లలపై అత్యాచారాలు, హత్యలు జరిగాయని రోజా విమర్శించారు. ప్రజలు కష్టాల్లో ఉంటే సీఎం చంద్రబాబు స్పెషల్ ఫ్లైట్‌లో హైదరాబాద్‌ వెళ్లి అన్‌స్టాపబుల్ షోలో పాల్గొని ఎంజాయ్ చేస్తున్నారని రోజా ఎద్దేవా చేశారు. ప్రభుత్వ చేతగాని తనం వల్లే ఉన్మాదులు, నేరస్థులు పేట్రేగిపోతున్నారన్నారని మండిపడ్డారు. మద్యం షాపుల పెంపుదల, గంజాయి వాడకం పెరగడం వల్లే మహిళలపై, చిన్నారులపై దాడులు పెరుగుతున్నాయన్నారు.

మరోపక్క ఈ ఘటన పట్ల సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. శనివారం అనకాపల్లి జిల్లాలోని వెన్నెలపాలెంలో పర్యటించిన బాబు.. ఈ సందర్భంగా ప్రసంగంలో చిన్న పిల్లలపై జరిగిన అమానవీయ ఘటనలను తీవ్రంగా ఖండించారు. చిన్నారులను కూడా వదలకుండా దాడులు జరుపుతున్న వారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇలాంటి అమానవీయ చర్యలను అడ్డుకోవాలంటే నడిరోడ్డుమీదనే ఉరితీయడం అవసరం” అని పేర్కొన్నారు. గంజాయి, మద్యం వల్లే రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని , ఇప్పటికే హెచ్చరించాం. మరోసారి ఆడబిడ్డల జోలికి వస్తే వారికి అదే చివరి రోజు అని మాస్ వార్నింగ్ ఇచ్చారు.

ఆడబిడ్డలకి చిన్న కష్టం వచ్చినా తొక్కి నార తీస్తానన్నావ్ కదా @PawanKalyan ?

కామాంధులకి చిక్కి రాష్ట్రంలో దాదాపు 100 మంది ఆడబిడ్డలు చనిపోయారు. మరి నిందితుల్లో ఎంత మందిని తొక్కి నార తీశావ్ పవన్ కళ్యాణ్?

-ఆర్కే రోజా గారు, వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి#APisNotinSafeHands… pic.twitter.com/it2x3AyROL

— YSR Congress Party (@YSRCParty) November 2, 2024

Read Also : Karthika Masam : మహిళలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chadrababu
  • Pawan Kalyan
  • RK Roja
  • tirupathi
  • Tirupathi Rap & Murder issue

Related News

    Latest News

    • Toll Plaza Fee : టోల్ ప్లాజాల వద్ద కొత్త రూల్.. ఫాస్టాగ్ లేకపోతే జేబు ఖాళీ అవ్వడం ఖాయం!

    • Bengulur : కార్పొరేట్ కంపెనీలో జాబ్ వదిలేసి..విధుల్లో ఆటో నడుపుతున్న టెకీ..అసలు ఏంజరిగింది !!

    • 20 Lakh Jobs : సింగపూర్, దుబాయ్‌ను మించేలా లోకేశ్ మాస్టర్ ప్లాన్!

    • Pithapuram : పవన్ కల్యాణ్ మార్క్ పాలన.. మున్సిపాలిటీగా గొల్లప్రోలు !

    • Gang Rape : 13 ఏళ్ల మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం..జోరు వర్షంలో దారుణం

    Trending News

      • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

      • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

      • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

      • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd