Ram Gopal Varma: నేను బయట.. ఆయన లోపల
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ రాజకీయాలపై ఆసక్తి చూపిస్తుంటారు. ఇదివరకు ఆయన ఏపీ రాజకీయాలపై సినిమాలు కూడా తీశారు. గత ఎన్నికలకు ముందు సీఎం జగన్ కు మద్దతుగా, చంద్రబాబుకు వ్యతిరేకంగా సినిమాని తెరకెక్కించి తన మార్క్ చూపించాడు.
- By Praveen Aluthuru Published Date - 03:30 PM, Thu - 26 October 23

Ram Gopal Varma: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ రాజకీయాలపై ఆసక్తి చూపిస్తుంటారు. ఇదివరకు ఆయన ఏపీ రాజకీయాలపై సినిమాలు కూడా తీశారు. గత ఎన్నికలకు ముందు సీఎం జగన్ కు మద్దతుగా, చంద్రబాబుకు వ్యతిరేకంగా సినిమాని తెరకెక్కించి తన మార్క్ చూపించాడు.
ప్రస్తుతం ఆర్జీవీ వ్యూహం పేరుతో సినిమా తీస్తున్నాడు. సీఎం జగన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమా నేపథ్యంలో ఆర్జీవీ సీఎం జగన్ ని కూడా కలిశాడు. ఇద్దరి మధ్య దాదాపు 40 నిమిషాల పాటు చర్చలు సాగాయి. ఇదిలా ఉండగా తాజాగా ఆర్జీవీ చేసిన పని రాజకీయంగా చర్చకు దారి తీసింది. రామ్ గోపాల్ వర్మ రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు నిలబడి సెల్ఫీ తీసుకున్నాడు. దానికి పొలిటికల్ టచ్ కూడా ఇచ్చాడు. నేను బయట.. ఆయన లోపల అంటూ క్యాప్షన్ ఇచ్చి ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ పెట్టాడు. దీంతో అర్జీవిపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు.
స్కిల్ కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. స్కిల్ డెవెలప్మెంట్ కేసులో 300 కోట్లకు పైగా అవినీతి జరిగినట్టు ఆంధ్రప్రదేశ్ ఏసీబీ ఆరోపించింది. దీంతో చంద్రబాబును అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. వాదనలు విన్న న్యాయస్థానం చంద్రబాబుకు రిమాండ్ విధించింది. అయితే చంద్రబాబుని ఉంచిన జైలు బయట ఆర్జీవీ సెల్ఫీ తీసుకోవడం, దానికి నేను బయట, ఆయన లోపల అంటూ చంద్రబాబుని ఉద్దేశించి కామెంట్స్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read: T Congress Target : కేసీఆర్ ఫ్యామిలీ నేతలే..కాంగ్రెస్ టార్గెట్ ..?