Nandyala : నంద్యాలలో పట్టాలు తప్పిన రైలు.. ఏమైందంటే..
ఈ పెట్రోల్ ట్యాంకర్ గూడ్స్ రైలు కర్ణాటకలోని బెటిపిన్ నుంచి కాకినాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం(Nandyala) జరిగిందన్నారు.
- By Pasha Published Date - 12:03 PM, Tue - 1 October 24

Nandyala : ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల రైల్వే స్టేషన్ సమీపంలో పెట్రోల్ ట్యాంకర్ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. పట్టాలు తప్పిన రైలు 5వ లైన్‌పై నిలిచిపోయింది. ఈ రైలులో చివర్లో ఉన్న మూడు బోగీలు పట్టాలు తప్పి పక్కకు ఒరిగాయి. దీంతో రైల్వే అధికారులు, సాంకేతిక సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. సాంకేతిక లోపం వల్లే రైలు పట్టాలు తప్పి ఉండొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. వెంటనే ఆ ట్రాక్‌ను సరిచేసి, రైలును పట్టాలపైకి ఎక్కించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read :Govinda : గన్ మిస్‌ఫైర్.. నటుడు గోవిందా కాలులోకి బుల్లెట్
ఈ పెట్రోల్ ట్యాంకర్ గూడ్స్ రైలు కర్ణాటకలోని బెటిపిన్ నుంచి కాకినాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం(Nandyala) జరిగిందన్నారు. డీజిల్ ఫిల్లింగ్ చేసుకోవడానికి కాకినాడ సమీపంలోని గంగినేని ఫిల్లింగ్ స్టేషన్ వద్దకు ఖాళీ ట్యాంకర్లతో ఈ రైలు బయలుదేరగా పట్టాలు తప్పింది. రైలు స్టేషను వద్దకు చేరుకొని.. గంటకు కేవల 10 కి.మీ వేగంతో ఉన్నప్పుడు పట్టాలు తప్పడంతో భారీ ప్రమాదం చోటుచేసుకోలేదు. నంద్యాల రైల్వే స్టేషన్ వద్దనున్న 1వ, 2వ లైన్ల మీదుగా రైళ్ల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. రైలు ఎందుకు పట్టాలు తప్పిందనే దానిపై అధికారులు విచారణ మొదలుపెట్టారు.
Also Read :Indian Soldiers : లెబనాన్ బార్డర్‌లో 600 మంది భారత సైనికులు.. వాట్స్ నెక్ట్స్ ?
ఈ మధ్య కాలంలో మన దేశంలో పలుచోట్ల రైలు పట్టాలకు అడ్డంగా కొన్ని వస్తువులు లభ్యమయ్యాయి. కొందరు గుర్తు తెలియని దుండగులు రాళ్లు, ఇనుపరాడ్లు, గ్యాస్ సిలిండర్, కాంక్రీట్ స్తంభాల వంటివి రైల్వే ట్రాక్‌లపై పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ వార్తలు విని ఎంతోమంది రైలు ప్రయాణికుల్లో కలవరం పెరిగింది. ఇటీవలే ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో రైల్వే ట్రాక్‌పై గ్యాస్ సిలిండర్ ప్రత్యక్షమైంది. పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లోని లోకో పైలట్ దీన్ని గమనించి వెంటనే బ్రేక్ వేయడంతో పెను ప్రమాదం తప్పింది. లేదంటే భారీ పేలుడు సంభవించి ఎంతో ప్రాణనష్టం జరిగి ఉండేది. ముంబై నుంచి లక్నోకు వెళ్తున్న రైలు గోవింద్‌పురి స్టేషన్ సమీపంలోని హోల్డింగ్ లైన్‌కు చేరుకోగా.. పట్టాలపై ఫైర్ సేఫ్టీ సిలిండర్ పడి ఉంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.