Alipiri Steps : మొన్నటి వరకు పులులు..ఇప్పుడు పాములు..గోవిందా..!!
కొంతమంది భక్తులు అలిపిరి మెట్ల మార్గాన వెళ్లి దర్శనం చేసుకుంటారు. అయితే ఈ మార్గాన వెళ్లే భక్తులు నిత్యం భయం భయం తో ముందుకు సాగుంతుంటారు
- By Sudheer Published Date - 06:36 PM, Sun - 28 July 24

తిరుముల వెంకన్న (Tirumala Venkanna) భక్తులకు నిత్యం ఇబ్బందులు , భయాలు తప్పడం లేదు. వెంకన్నను ప్రతి రోజు కొన్ని వేలమంది దర్శనం చేసుకుంటారు. కోరికలు తీర్చే వెంకన్నను దర్శించుకొనేందుకు ప్రతి రోజు అనేక రాష్ట్రాల నుండి భక్తులు వస్తారు. కొంతమంది భక్తులు అలిపిరి మెట్ల మార్గాన వెళ్లి దర్శనం చేసుకుంటారు. అయితే ఈ మార్గాన వెళ్లే భక్తులు నిత్యం భయం భయం తో ముందుకు సాగుంతుంటారు. ఎటు నుండి ఏ ప్రమాదం వస్తుందో అని భయం భయంగా నడక సాగిస్తుంటారు. ముఖ్యంగా క్రూర మృగాలా నుండి ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుంటాయి. కొద్దీ నెలల క్రితం వరకు పెద్ద ఎత్తున పులుల (Tiger) సంచారం నడిచింది. పులి దాడికి ఓ చిన్నారి కూడా మృతి చెందింది. పులుల నుండి కప్పుకోవడానికి గత ప్రభుత్వం చేతి కర్రలు కూడా ఇచ్చింది..ఇటీవల కాస్త పులుల సంచారం తగ్గిందని అనుకుంటే..పాములా (Snakes) బెడద ఎక్కువైంది.
We’re now on WhatsApp. Click to Join.
ప్రతి రోజు పదుల సంఖ్యలో మెట్ల మార్గాన పాములు సంచరిస్తూ భక్తులను పరుగులు పెట్టిస్తున్నాయి. తాజాగా మెట్ల మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్న భక్తుడిని పాము కాటు వేయడం తీవ్ర కలకలం రేపింది. చీరాలకు చెందిన భక్తుడు నాగేంద్ర(29) అనే యువకుడిని ఏడవ మైలు దగ్గర పాటు కాటు వేసింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు హుటాహుటిన బాధితుడిని తిరుమల అశ్విని ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు పరిశీలించి యువకుడికి ప్రాణాపాయం లేదని తెలిపడంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. పాము ఆకుపచ్చ రంగులో ఉందని బాధితుడి సోదరుడు తెలిపారు. ఈ ఘటనతో నడకదారిలో వెళ్తున్న భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మొన్నటి వరకు పులులు అంటే ఇప్పుడు పాములా..గోవిందా అంటూ భక్తులు వాపోతున్నారు.
Read Also : Accident : దేవుడి దర్శనానికి వెళ్తూ..ఏకంగా దేవుడి దగ్గరికే వెళ్లారు