Nandu’s World Nandana: మా మీద కావాలనే కుట్ర.. డబ్బులిచ్చి సోషల్ మీడియా లో దుష్ర్పచారం Nandu’ s world సంచలనం
- Author : Vamsi Chowdary Korata
Date : 02-06-2026 - 12:55 IST
Published By : Hashtagu Telugu Desk
Nandu’s World Nandana నందూస్ వరల్డ్ పేరుతో సోషల్ మీడియాలో ఫేమస్ అయిన భార్యాభర్తలపై కొద్దిరోజులుగా వివాదాలు చుట్టుముట్టాయి. యూకే వీసా పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ. 20 లక్షలు వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి. సోషల్ మీడియా వేదికగా ఈ జంట టార్గెట్‌గా పోస్టులు వైరల్ అయ్యాయి. ఈ ఆరోపణలపై నందూస్ వరల్డ్ నందన స్పందించారు.. ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు.
‘నందూస్ వరల్డ్’ (Nandus World) పేరుతో యూకేలో ఉంటున్న భార్యాభర్తలు నందన, మధు సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ సంపాదించారు. కొద్దిరోజులుగా ఈ జంటపై సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతోంది. వీరిద్దరు కలిసి వీసా స్కామ్ చేశారని, కోట్లలో వసూళ్లు చేశారంటూ ఆరోపణలు వచ్చాయి. వారిద్దరిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు బాగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ పరిణామాలపై Nandus World నందన క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆమె స్పందించారు.
తమ కుటుంబం గురించి కొంతమంది వ్యక్తులు డబ్బులు తీసుకుని నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని నందన ఆరోపించారు. వ్యక్తిగతంగా కక్ష పెంచుకుని ఇలా చేస్తున్నారని.. ఇప్పటికే యూకేలో వాళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకున్నామని చెప్పారు. యూకే నుంచి ముగ్గురు వ్యక్తులు ఇండియాకు పారిపోయారని.. ఆ ముగ్గురు పనిగట్టుకుని తమపై వ్యక్తిగతంగా కక్ష పెంచుకుని, పర్సనల్‌గా తీసుకుని నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు కానీ, తన భర్తకు కానీ గత 21 ఏళ్లుగా ఇండియాలో ఎలాంటి కంపెనీలు లేవని చెప్పారు. కొంతమంది తమ పేర్లు వాడుకుంటూ డబ్బులు తీసుకుంటున్నారని చెప్పుకొచ్చారు.
దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. తమకు ఏమున్నా సరే యూకేలో మాత్రమే ఉన్నాయని చెప్పారు. తమ కంపెనీ పేర్లు, పని ప్రదేశాలను (workplaces) దుర్వినియోగం చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దయచేసి ఇలాంటి వాటిని నమ్మొద్దని.. ఒకవేళ తనకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే తామే అధికారికంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తామని చెప్పారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని, సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయొద్దని నందన కోరారు.
Nandus World పేరుతో భార్యాభర్తలు బాగా ఫేమస్ అయ్యారు. నందన, సంక్రాంతికి విడుదలైన మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘మన శంకర వరప్రసాద్’లో కూడా నటించారు. కొద్దిరోజులుగా ఈ భార్యాభర్తలపై భారీ COS వీసా స్కామ్ ఆరోపణలు వచ్చాయి. ఇండియాలో ఉన్న వారిని టార్గెట్ చేసి, COS Job Visa ఇప్పిస్తామని చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ. 20 లక్షలు వసూలు చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఏకంగా 50 మందికి పైగా ఇలా రూ. 20 లక్షల చొప్పున కోట్లు వసూలు చేశారంటూ ఆరోపించారు. వాళ్ల దగ్గర ఐదారు కంపెనీలు ఉన్నాయని, అందరికీ COS ఇవ్వగలమని నమ్మించి డబ్బు తీసుకున్నారని వారిపై పోస్టులు వైరల్ అయ్యాయి. వీరు డబ్బులు తీసుకున్న తర్వాత ఫోన్ కాల్స్‌కు సమాధానం ఇవ్వడం లేదని, మెసేజ్‌లకు రిప్లై లేదని ఆరోపించారు. సోషల్ మీడియాలో కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారంపై నందన స్పందించి క్లారిటీ ఇచ్చారు.
తమపై కొందరు తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు.