HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >2 Days Of Mourning In Ap

Ramoji Rao Died : ఏపీలో 2 రోజులు సంతాప దినాలు

రామోజీరావు మృతికి నివాళిగా ఏపీ ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది

  • Author : Sudheer Date : 08-06-2024 - 4:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cbn Ap
Cbn Ap

ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మృతికి నివాళిగా ఏపీ ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. రేపు, ఎల్లుండి సంతాప దినాలుగా ప్రకటిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రామోజీరావు (Ramojirao).. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈయన మృతి పట్ల యావత్ ప్రజానీకం దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తుంది.

ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం రేపు రామోజీ రావు అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరపబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి సీఎం రేవంత్ సీస్ కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇటు ఏపీ ప్రభుత్వం సైతం రామోజీరావు మృతికి నివాళిగా ఏపీ ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. రేపు, ఎల్లుండి సంతాప దినాలుగా ప్రకటిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

కొద్దీ సేపటి క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు-భువనేశ్వరి దంపతులు రామోజీ ఫిలిం సిటీలో రామోజీరావు పార్థివదేహానికి నివాళులు అర్పించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు శంషాబాద్​ ఎయిర్​పోర్టు నుంచి నేరుగా ఫిలింసిటీకి చేరుకున్నారు. రామోజీరావు కుటుంబసభ్యులను ఓదార్చారు. మార్గదర్శి, ఈనాడు, ఈటీవీ, ఫిలింసిటీ సహా అనే వ్యవస్థల నిర్మాణంతో తెలుగుజాతికి ఆయన చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. అలాంటి మహాయోధుడి మరణం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు.

రామోజీరావు మరణం చాలా బాధాకరమన్న చంద్రబాబు ఆ వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. సమాజహితం కోసమే అనునిత్యం కష్టపడ్డారని, తెలుగుజాతి కోసం అహర్నిశలు పనిచేశారని తెలిపారు. రామోజీరావు ఒక వ్యక్తి కాదు, వ్యవస్థ అని కొనియాడారు. చిత్రపరిశ్రమకు ఎనలేని సేవలు చేశారన్న చంద్రబాబు ధర్మం ప్రకారం పనిచేస్తానని రామోజీరావు స్పష్టంగా చెప్పేవారని గుర్తుచేసుకున్నారు. రామోజీరావు నిర్మించిన వ్యవస్థలు శాశ్వతమని, అత్యున్నత ప్రమాణాలతో రామోజీ ఫిల్మ్‌సిటీ స్థాపించారని పేర్కొన్నారు.

Read Also : Padi Kaushik : పొన్నం ప్ర‌భాక‌ర్‌ను మంత్రివ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయాలి – ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • chandrababu
  • Ramojirao

Related News

Chandrababu Once Again Show

CBN Birthday : మరోసారి గొప్ప మనసు చాటుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 269 అన్న క్యాంటీన్లలో నేడు రోజంతా ఉచితంగా భోజనం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. పేదవాడి ఆకలి తీర్చడమే లక్ష్యంగా గతంలో ప్రారంభించిన ఈ అన్న క్యాంటీన్లు, నేడు పండుగ వాతావరణంలో వేలాది మందికి ఉచితంగా ఆకలి తీరుస్తున్నాయి

  • I entered politics with the aim of serving the public: CM Chandrababu

    Chandrababu Campaign : తమిళనాడులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం

Latest News

  • ఆన్‌లైన్ గేమింగ్‌.. కేంద్రం కీల‌క నిర్ణ‌యం!

  • ఇరాన్‌తో చర్చలకు ట్రంప్ సంకేతం.. ఆ రోజే రెండో ద‌ఫా చ‌ర్చలు?

  • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

  • కాపురంలో చిచ్చు పెట్టిన నైటీ..!

  • KMB : కోటక్ మహీంద్రా బ్యాంక్ లో ఈజీ గా రుణాలు తీసుకోవచ్చు..ఎలాగంటే !!

Trending News

    • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

    • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

    • దిల్షాన్ మదుశంక.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చి రికార్డుల్లోకి!

    • దిగ్బంధనం అంటే యుద్ధం ప్రకటించడమే: ఇరాన్‌

    • ఇకపై మ‌న అనుమతి లేకుండా బ్యాంకులో డబ్బులు కట్ కావు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd