Padi Kaushik : పొన్నం ప్రభాకర్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి – ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
ఒక్కో లారీలో సుమారు 70 నుంచి 100 టన్నులు కూడా ఉంటుందని అన్నారు. ఈ రవాణా ద్వారా వందల కోట్ల స్కాం జరుగుతుందని ఆయన అన్నారు
- By Sudheer Published Date - 04:28 PM, Sat - 8 June 24

రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar)ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసారు హుజురాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy). మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా సంస్థ అధికారులతో కుమ్మక్కై రోజుకు 50 లక్షలు సంపాదిస్తున్నారని కౌశిక్ ఆరోపించారు. శనివారం వే బిల్లు లేకుండా అధిక లోడ్ తో 32 టన్నులతో పోవాల్సిన లారీలు 80 టన్నుల లోడ్ తో వెళ్తున్న ఫ్లై యాష్ లారీలను అడ్డుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. రామగుండం ఎన్టీపీసీ నుండి హుజురాబాద్ మీదుగా ఖమ్మంకు ఎలాంటి వే బిల్లులు లేకుండా అధిక లోడుతో రోజుకు 300 బూడిద లారీలు వెళ్తున్నాయి. దీనికోసం రోజుకు రూ. 50 లక్షలు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వెళ్తున్నాయి. ఇలా ఇప్పటికే రూ. 100 కోట్లు వెళ్లాయి అని ఆరోపించారు.
We’re now on WhatsApp. Click to Join.
మంత్రి కనుసనల్లోనే ఈ అక్రమ ఫ్లై యాష్ రవాణా జరుగుతుందన్నారు. ఒక్కో లారీలో సుమారు 70 నుంచి 100 టన్నులు కూడా ఉంటుందని అన్నారు. ఈ రవాణా ద్వారా వందల కోట్ల స్కాం జరుగుతుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఇంత పెద్ద స్కామ్ జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉందన్నారు. ఇంత పెద్ద స్కాం ను లైవ్ లో పట్టుకున్నామని అన్నారు. ఒక లారీ వెళ్లడానికి సుమారు 25 వేల వరకు ఖర్చు అవుతుందని, అందులో కేవలం 32 టన్నులు వెళ్లడానికి మాత్రమే అనుమతులు ఉంటాయని అన్నారు. 32 టన్నులు మాత్రమే పోవాల్సిన లారీల్లో 70 నుంచి 100 టన్నుల వరకు తీసుకువెళ్తున్నారని అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మంత్రి పొన్నం ప్రభాకర్ ను పదవి నుంచి భర్త రఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Read Also : Lok Sabha Opposition: లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్.. సీఎం రేవంత్ డిమాండ్