Bapatla : మార్కులు వేయకపోతే.. చేతబడి చేయిస్తానంటూ బెదిరించిన విద్యార్థి
తెలుగు సబ్జెక్టులో రామాయణం ప్రాశస్త్యం గురించి వివరించండి అన్న ప్రశ్నకు ఓ విద్యార్థి సమాధానం రాయకుండా, 'నాకు మార్కులు వేయకపోతే మా తాత చేత చేతబడి చేయిస్తా' అని రాయడంతో ఉపాధ్యాయులు షాక్ అయ్యారు
- Author : Sudheer
Date : 10-04-2024 - 4:40 IST
Published By : Hashtagu Telugu Desk
మాములుగా ప్రశ్నాపత్రంలో సమాదానాలు ఉంటాయి. కానీ ఈ మధ్య విద్యార్థులు రెచ్చిపోతూ..ఉపాధ్యాయులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తాజాగా పదో తరగతి (10th Class Student) సమాధానం పేపర్ లో ఓ విద్యార్థి తనకు మార్కులు వేయకపోతే తన తాత చేత చేతబడి చేయిస్తానంటూ సమాధానం రాసి షాక్ ఇచ్చాడు. ఈ ఘటన బాపట్ల (Bapatla) పురపాలక ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్ష జవాబు పత్రాల్లో బయటపడింది.
We’re now on WhatsApp. Click to Join.
తెలుగు సబ్జెక్టులో రామాయణం ప్రాశస్త్యం గురించి వివరించండి అన్న ప్రశ్నకు ఓ విద్యార్థి సమాధానం రాయకుండా, ‘నాకు మార్కులు వేయకపోతే మా తాత చేత చేతబడి చేయిస్తా’ అని రాయడంతో ఉపాధ్యాయులు షాక్ అయ్యారు. వెంటనే జవాబు పత్రాన్ని పై అధికారులకు చూపించారు. అయితే, సదరు విద్యార్థికి వందకు 70 మార్కులు రావడం విశేషం. మరో జవాబు పత్రంలో రామాయణంలో పాత్ర స్వభావం గురించిన ప్రశ్నకు ‘మంధర శివాజీ మహారాజును తీసుకుని దండకారణ్యానికి వెళ్లింది’ అని రాయడంతో ఉపాధ్యాయులు ఆశ్చర్యపోయారు. ఈరోజుల్లో పిల్లలు ఇలా తయారయ్యంరేంటి అని మాట్లాడుకున్నారు.
Read Also : Kejriwal : సుప్రీంకోర్టులో అర్వింద్ కేజ్రీవాల్‌కు చుక్కెదురు