CM Chandrababu : డయేరియాతో 10 మంది మృతి..సీఎంకు కమ్యూనిస్టుల లేఖ
తక్షణమే డయేరియా నివారించేందుకు ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ..సీఎం చంద్రబాబు నాయుడుకి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. పల్నాడు జిల్లా, దాచేపల్లిలో వాంతులు విరోచనాలతో ఇద్దరు మృతి చెందటం విచారకరం అని పేర్కొన్నారు.
- By Latha Suma Published Date - 10:42 AM, Fri - 25 October 24

CPI State Secretary K Ramakrishna : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఇటీవల విజయనగరం జిల్లా, గుర్లలో డయేరియాతో 10 మంది మరణించగా, వందలాదిమందికి ప్రబలిందని తెలుపుతూ..సీఎం చంద్రబాబు నాయుడుకి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ బహిరంగ లేఖ రాశారు. నీటి కలుషితం, భూగర్భ జలాల కలుషితం వల్ల డయేరియా వ్యాప్తి చెందుతున్నదని వెల్లడించారు. తక్షణమే డయేరియా నివారించేందుకు ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ..సీఎం చంద్రబాబు నాయుడుకి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. పల్నాడు జిల్లా, దాచేపల్లిలో వాంతులు విరోచనాలతో ఇద్దరు మృతి చెందటం విచారకరం అని పేర్కొన్నారు.
మరోవైపు పల్నాడు జిల్లా దాచేపల్లి లోని అంజనాపురం కాలనీలో డయేరియా వాంతులు, విరేచనాలతో ఇద్దరు మృతి చెందారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కలెక్టర్‌తో సీఎం చంద్రబాబు మాట్లాడారు. డయేరియాతో ఇద్దరు మృతి చెందారన్న సమాచారంపై నీరు కలుషితం కావడం వల్ల చనిపోయారా లేక వేరే కారణాలున్నాయా అని తీరా తీశారు. ప్రస్తుతం దాచేపల్లిలోని పరిస్థితులను చంద్రబాబుకు కలెక్టర్ వివరించారు.
స్థానిక బోర్ల వాటర్‌ను ల్యాబ్‌కు పంపాలని సూచించారు. బోర్లను మూసి వేసి వాటర్ ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలని ఆదేశించారు. దాచేపల్లిలో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, సాధారణ పరిస్థితి వచ్చేవరకు నిత్యం పర్యవేక్షించాలని, బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని కలెక్టర్‌కు సీఎం చంద్రబాబు ఆదేశించారు.