Search On Mobile : గూగుల్ క్రోమ్‌లో 5 కొత్త ‘సెర్చ్’ ఫీచర్స్
గూగుల్ క్రోమ్ ప్రపంచంలో అత్యధికులు వినియోగిస్తున్న వెబ్ బ్రౌజర్. ఇందులో 5 నూతన ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి.
- By Pasha Published Date - 12:32 PM, Sun - 30 June 24
Search On Mobile : గూగుల్ క్రోమ్ ప్రపంచంలో అత్యధికులు వినియోగిస్తున్న వెబ్ బ్రౌజర్. ఇందులో 5 నూతన ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇంతకీ అవేమిటి ? వాటిని ఎలా వినియోగించాలి ? ఆ ఫీచర్లతో నెటిజన్లకు కలిగే సౌలభ్యం ఏమిటి ? ఇప్పుడు తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
- గూగుల్ క్రోమ్ బ్రౌజర్లోని అడ్రస్ బార్‌ను నూతనంగా రీడిజైన్ చేశారు. అయితే ఈ ఫీచర్ ప్రధానంగా ట్యాబ్లెట్లో ఉండే క్రోమ్ బ్రౌజర్లో పని చేస్తుంది. దీనివల్ల మీరు ఏదైనా సెర్చ్ చేస్తున్నప్పుడు, సెర్చ్ బార్ కిందనే డ్రాప్‌డౌన్ కనిపిస్తుంది. అందులో మీరు ఇటీవల చూసిన వెబ్సైట్లు, వెతుకుతున్న విషయానికి సంబంధించిన అంశాలు కనిపిస్తాయి.
- ‘ట్రెండింగ్ సెర్చెస్’ ఫీచర్ ఇప్పటి వరకు ఆండ్రాయిడ్ యూజర్లకే అందుబాటులో ఉంది. ఇప్పుడిది యాపిల్ ఐఫోన్ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. యాపిల్ యూజర్లు సెర్చ్ బార్‌పై క్లిక్ చేస్తే..ప్రస్తుతం ఆ ప్రాంతంలో ట్రెండింగ్‌లో ఉన్న అంశాలు కనిపిస్తాయి.
- కొత్తగా లైవ్ స్పోర్ట్స్ కార్డ్‌లు గూగుల్ క్రోమ్‌లోని డిస్కవర్ ఫీడ్‌లో(Search On Mobile) కనిపిస్తాయి. గతంలో వెతికిన వార్తలు, స్పోర్ట్స్ కార్డులు ఇందులో డిస్ప్లే అవుతాయి. మూడు చుక్కల మెనూను ఉపయోగించి డిస్కవర్ ఫీచర్‌ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు.
- బస్సులు, ట్రైన్ల వేళలను క్రోమ్ సెర్చ్‌లోనే తెలుసుకోవచ్చు. సెర్చ్ బార్లో ‘షెడ్యూల్’ అని టైప్ చేయగానే మీరున్న ప్రాంతానికి చెందిన రవాణా సర్వీసుల షెడ్యూల్ వివరాలు వెబ్సైట్ సజెషన్స్‌లో కనిపిస్తాయి.
- గూగుల్ క్రోమ్‌లో రెస్టారెంట్లను వెతకడం ఇక చాలా ఈజీ. మనం రెస్టారెంట్ కోసం సెర్చ్ చేస్తే సెర్చ్ బార్ దగ్గర కొత్తగా 3 షార్ట్‌కట్ బటన్స్ డిస్ప్లే అవుతాయి. వాటి సాయంతో ఆ రెస్టారెంట్ ఫోన్ నంబర్, రూట్ మ్యాప్, రివ్యూలను సింగిల్ క్లిక్‌తో తెలుసుకోవచ్చు. ఇప్పటికే ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉండగా.. త్వరలో ఐఫోన్ యూజర్లకూ అందుబాటులోకి వస్తుంది.