HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Worlds First Ai Doctor Clinic Opens In Saudi Arabia

Worlds First AI Doctor : ప్రపంచ తొలి ఏఐ డాక్టర్‌, ఏఐ క్లినిక్.. పనిచేసేది ఇలా

సౌదీలో ఏర్పాటైన ఈ  ఏఐ క్లినిక్‌కు ‘డాక్టర్‌ హువా’(Worlds First AI Doctor) అని పేరుపెట్టారు.

  • Author : Pasha Date : 18-05-2025 - 8:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Worlds First Ai Doctor Clinic Saudi Arabia

Worlds First AI Doctor : ఇది కృత్రిమ మేధ (ఏఐ) యుగం. ఏఐ టెక్నాలజీతో రోగులను పరీక్షించే  క్లినిక్‌ ప్రపంచంలోనే తొలిసారిగా ఏర్పాటైంది. ఎక్కడొో తెలుసా ? సౌదీ అరేబియాలో !! దీన్ని ఏర్పాటు చేసింది ఎవరో తెలుసా ?  చైనాకు చెందిన మెడికల్ టెక్నాలజీ కంపెనీ సైన్యీ ఏఐ. ఏఐ రంగంలో చైనా దూసుకుపోతున్న తీరుకు ఈ ఆవిష్కరణ ఒక నిదర్శనం.  వివరాలివీ..

Also Read :Pakistani Beggars : పాక్ జనాభా 26 కోట్లు.. బెగ్గర్స్ 2.2 కోట్లు.. షాకిచ్చిన సౌదీ

తొలి ఏఐ క్లినిక్‌ ఇలా పనిచేస్తుంది.. 

  • చైనాకు చెందిన సైన్యీ ఏఐ  కంపెనీ, సౌదీ అరేబియాకు చెందిన అల్‌మూసా హెల్త్‌ గ్రూప్‌‌తో కలిసి ప్రపంచంలోనే తొలి ఏఐ క్లినిక్‌ను ఏర్పాటు చేసింది.
  • సౌదీలో ఏర్పాటైన ఈ  ఏఐ క్లినిక్‌కు ‘డాక్టర్‌ హువా’(Worlds First AI Doctor) అని పేరుపెట్టారు.
  • ఈ క్లినిక్‌ను ప్రస్తుతం ప్రయోగాత్మకంగా నడపనున్నారు.
  • సౌదీలోని అల్‌ అహ్సా ప్రావిన్స్‌లో ఈ క్లినిక్‌‌ను ఏర్పాటు చేశారు.
  • ఈ క్లినిక్‌లోని ఏఐ డాక్టర్ తొలుత రోగులతో సంభాషిస్తాడు. వారి ఆరోగ్య సమస్యల వివరాలను, రోగ లక్షణాలను తెలుసుకుంటాడు. ఆ తర్వాత వ్యాధి నిర్ధారణ చేస్తాడు. తదుపరిగా చికిత్సను మొదలుపెడతాడు. ఈ ప్రక్రియను వైద్య నిపుణులు నిరంతరం పర్యవేక్షిస్తుంటారు.
  • ఈ క్లినిక్‌లోకి రోగి ఎంటరయ్యాక.. ఒక ట్యాబ్‌ సాయంతో ఏఐ డాక్టర్‌కు తమ వ్యాధి లక్షణాలను వివరించాలి. వెంటనే అది కొన్ని ప్రశ్నలు వేస్తుంది. వాటికి సమాధానాలు చెప్పాలి.
  • అనంతరం మానవ సహాయకుల సాయంతో సేకరించిన డేటాను, చిత్రాలను విశ్లేషిస్తారు.
  • ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత డాక్టర్‌ హువా వైద్య చికిత్స ఎలా చేసుకోవాలని సిఫారసులు చేస్తుంది.
  • ఇదంతా అక్కడున్న వైద్య నిపుణుడు విని.. సమీక్షించి.. సంతకం చేస్తాడు.
  • ఏఐ పరిశీలించలేని అత్యవసర కేసుల వ్యవహారంలో నేరుగా వైద్యులే అన్నీ చూస్తారు.
  • సౌదీలోని ఈ ఏఐ డాక్టర్‌ ఉబ్బసం సహా దాదాపు 30 రకాల శ్వాసకోశ రుగ్మతలకు సంబంధించిన కన్సల్టేషన్‌ సేవలను అందించగలడట.
  • రాబోయే రోజుల్లో ఏఐ డాక్టర్ 50 శ్వాస, జీర్ణకోశ, చర్మ సంబంధ వ్యాధులకు సేవలను అందిస్తాడట.

Also Read :EOS 09 Mission : ఈఓఎస్‌-09 ఉపగ్రహ ప్రయోగం ఫెయిల్.. కారణమిదీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AI Doctor
  • Saudi Arabia
  • Saudi Arabia AI Doctor
  • Worlds First AI Clinic
  • Worlds First AI Doctor

Related News

    Latest News

    • ఐపీఎల్ 2026.. ఫిట్‌గా స్టార్ ప్లేయ‌ర్!

    • టైర్ల‌పై ఉన్న నంబర్ల అర్థం తెలుసా? ఇది మీ భద్రతకు చాలా ముఖ్యం!

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • ఇజ్రాయెల్ ప్రధానికి క్యాన్స‌ర్‌.. నిజ‌మేనా?!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    Trending News

      • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

      • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

      • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

      • లఖ్‌పతి బిటియా యోజన 2026.. కుమార్తెల చదువు కోసం సరికొత్త పథకం!!

      • టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఐపీఎల్ నుంచి బంపర్ ఆఫర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd