Shock To Lalit Modi: భారత్ ఎఫెక్ట్.. లలిత్ మోడీకి వనౌతు పాస్‌పోర్ట్ రద్దు
న్యూజిలాండ్‌లోని భారత హైకమిషనర్ నీతా భూషణ్(Shock To Lalit Modi) అందించిన సమాచారంతోనే వనౌతు ప్రధానమంత్రి ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిసింది.
- By Pasha Published Date - 10:44 AM, Mon - 10 March 25

Shock To Lalit Modi: మాతృ దేశానికి ఆర్థికంగా నయ వంచన చేసి పారిపోయిన ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీకి తగిన శాస్తి జరిగింది. ప్రస్తుతం లండన్‌లో దొంగలా తలదాచుకున్న అతడు.. అక్కడి నుంచి వనౌతు దేశానికి పరార్ అవుదామని భావించాడు. కోట్లాది రూపాయలను పెట్టుబడిగా పెట్టి మరీ వనౌతు దేశ గోల్డెన్ పాస్‌పోర్ట్‌ను లలిత్ తీసుకున్నాడు. అయితే భారత ప్రభుత్వం దౌత్య బలం ముందు అతడు నిలువలేకపోయాడు. భారత సర్కారు దౌత్యమార్గాల నుంచి అందిన సమాచారంతో వనౌతు ప్రధానమంత్రి జోథమ్ నపత్ అలర్ట్ అయ్యారు. ఆర్థిక మోసగాడు లలిత్ మోడీ పాస్‌పోర్టును వెంటనే రద్దు చేశారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వును విడుదల చేశారు. అతడు పెట్టుబడి పెట్టిన డబ్బులను వెనక్కి ఇచ్చేయాలని ఆర్డర్ ఇచ్చారు. తద్వారా లలిత్ మోడీ లాంటి నేరగాళ్లకు తమ దేశంలో చోటు ఉండదని వనౌతు ప్రధాని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.
Also Read :Bhupesh Baghel : భూపేష్ బఘేల్, చైతన్య బఘేల్ నివాసాల్లో ఈడీ రైడ్స్
కీలక వ్యాఖ్యలు
లలిత్ మోడీ పాస్‌పోర్టును రద్దు చేయాలంటూ వనౌతు పౌరసత్వ కమిషన్‌కు ఆదేశాలిస్తూ జారీ చేసిన ఉత్తర్వులో ప్రధానమంత్రి జోథమ్ నపత్ కీలక వివరాలను ప్రస్తావించారు. ‘‘లలిత్ మోడీ భారత్‌లో వివిధ ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడు. ఆ కేసుల్లో లలిత్ విచారణ ఎదుర్కోవాల్సి ఉంది. అతడిని లండన్ నుంచి భారత్‌కు తీసుకెళ్లేందుకు చట్టపరమైన చర్యలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో అతడు వనౌతు పాస్‌పోర్టును పొందాడు. భారత్‌కు తిరిగి వెళ్లకుండా ఉండే దురుద్దేశంతోనే వనౌతు పాస్‌పోర్టు తీసుకున్నాడు. అందుకే దాన్ని రద్దు చేయండి’’ అని వనౌతు ప్రధానమంత్రి జోథమ్ నపత్ తెలిపారు.
Also Read :Boinipally Srinivas Rao: బోయినపల్లి శ్రీనివాసరావు ఇంటికి గౌతమ్ అదానీ.. ఎవరాయన ?
నీతా భూషణ్ చొరవతో..
‘‘వనౌతు పాస్‌పోర్టును సరైన వ్యక్తులకు మాత్రమే ఇస్తాం. దీన్ని ఎవరూ దుర్వినియోగం చేయొద్దు. సరైన కారణాలను చూపే వారికి మాత్రమే మా దేశ పాస్‌పోర్టు దక్కుతుంది’’ అని ఆయన స్పష్టం చేశారు. ‘‘నేరాలు చేసి తప్పించుకునే వాళ్లకు మా దేశంలో చోటు లేదు’’ అని జోథమ్ నపత్ చెప్పారు. న్యూజిలాండ్‌లోని భారత హైకమిషనర్ నీతా భూషణ్(Shock To Lalit Modi) అందించిన సమాచారంతోనే వనౌతు ప్రధానమంత్రి ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిసింది.